త్రివిక్రమ్…టైటిల్ వేట మొదలు

ఎవరు ఊహించారు. అత్తారింటికి దారేది..అరవింద సమేత..అల వైకుంఠపురములో… ఇలాంటి టైటిళ్లతో సినిమాలు వస్తాయని. దర్శకుడు త్రివిక్రమ్ స్టైల్ నే అది. ఇప్పుడు అదే వరుసలో మరో టైటిల్ కోసం వేట మొదలయింది. రెగ్యులర్ గా…

ఎవరు ఊహించారు. అత్తారింటికి దారేది..అరవింద సమేత..అల వైకుంఠపురములో… ఇలాంటి టైటిళ్లతో సినిమాలు వస్తాయని. దర్శకుడు త్రివిక్రమ్ స్టైల్ నే అది. ఇప్పుడు అదే వరుసలో మరో టైటిల్ కోసం వేట మొదలయింది. రెగ్యులర్ గా వుండకూడదు. స్టార్ హీరో మహేష్ బాబు ఇమేజ్కు సరిపోవాలి. ఫ్యాన్స్ భలే వుందిగా అనుకోవాలి. ఇన్ని రూల్స్ రెగ్యులేషన్ల నడుమ టైటిల్ సెట్ కావాలి.

ఇలాంటి టైమ్ లో ఉగాది వస్తోంది. ఉగాదికి ఏదైనా అప్ డేట్, పోస్టర్ ఇవ్వాలంటే రెండే అవసరం. ఒకటి టైటిల్. రెండోది విడుదల తేదీ. ఆగస్టు 11 విడుదల తేదీ అని ఇప్పటికే రుమాలు వేసేసారు. ఆ తేదీ మార్చితే తప్ప దాని మీద కొత్త అనౌన్స్ మెంట్ అనవసరం. ఇక మిగిలింది టైటిల్ మాత్రమే. అందుకే ఉగాది కి ఏదైనా అప్ డేట్…విసెష్ చెప్పాలంటే టైటిల్ కావాలి.

ఇప్పుడు అదే పని మీద వున్నారు దర్శకుడు త్రివిక్రమ్. ఓ పక్కన నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. మార్నింగ్ ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకు వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ నెలాఖరుకు సాంగ్స్, ఒక ఫైట్ మినహా మిగిలిన వర్క్ అంతా పూర్తి చేయాలనే పకడ్బందీ షెడ్యూలుతో వెళ్తున్నారు. ఇలాంటి బిజీ వర్క్ లోనే టైటిల్ కసరత్తు కూడా జరుగుతోంది.

ఫ్యాన్స్ ఊహించలేని డిఫరెంట్ టైటిల్ తోనే..ఆఫ్ కోర్స్ ‘అ’ అక్షరంతోనే టైటిల్ వుంటుందని తెలుస్తోంది. అది తెలియాలంటే మరి కొంత కాలం వేచి వుండాల్సిందే.