ద్యేవుడా ఆ మాట అన్నతర్వాత ఎవరైనా మాట్లేడేందుకు ఏముంటుంది? ఏంటమ్మాయి …ఎంత స్టార్ హీరోయిన్ అయితే మాత్రం…మరీ ఇంత బరితెగింపా అని అడిగితే…ఆమె సమాధానం విన్నవాళ్లకు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తోంది. ఇంతకూ ఇదంతా ఎవరు గురించి అనే కదా మీ ప్రశ్న.
కియారా ఆడ్వాణీ….స్టార్ హీరోయిన్. కొన్ని రోజుల క్రితం ఆమె ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని కేలెండర్‌పై టాప్‌లెస్‌గా తళుక్కుమని మెరిసింది. ఈ ఫొటో బాగా వైరల్ అయి సంచలనం సృష్టించింది. దేనికైనా మంచీచెడు ఉన్నట్టే…కియారా ఫొటోపై రెండు రకాల కామెంట్స్ పెద్ద సంఖ్యలో వచ్చాయి. కియారా టాప్‌లెస్ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేసింది.
ఈ ఫొటోపై నెటిజన్లు ప్రశంసలతో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా బాగా చేశారనే చెప్పాలి. అయితే వాటిని కియారా చాలా లైట్‌గా తీసుకున్నారు. ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌కు గురైన తన టాప్‌లెస్ ఫొటోపై మాట్లాడారు.
తనకు ఆ టాప్‌లెస్ ఫొటో షూట్ ఓ సరదా అనుభవమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆ ఫొటోపై ట్రోలింగ్ తనను కూడా నవ్వించిందని సరదాగా చెప్పారు. నెటిజన్ల కామెంట్స్ తనను బాగా ఎంటర్‌టైన్ చేశాయని, వాటిల్లో కొన్నింటిని షేర్ చేసినట్టు కూడా కియారా అమాయకంగా చెప్పారు. ఇలా మాట్లాడితే ఎవరైతే మాత్రం ఏం చెబుతారు. కానివ్వండి…స్వేచ్ఛ ఉండేది ఇలాంటి వాటి కోసమే కదా!