ఇలియానా …గోవా అందగత్తె. ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగారు. స్టార్ హీరోయిన్‌గా అందరి ఆదరాభిమానాలు పొందారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ప్రయత్నించినా పెద్దగా రాణించలేకపోయారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే కొత్త తారల ముందు ఆమె నిలబడలేక పోయారు. దీంతో ఇలియానా అంటే … పాత హీరోయిన్ కింద లెక్క. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు.
తన అంద చందాలను సోషల్ మీడియా వేదికగా ఆరబోస్తూ … ఉనికి చాటుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారామె. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్‌పై ఆమె ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా పోస్టు వైరల్ అవుతోంది. తన శరీర భాగాల గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో చెబుతూనే, ఆ తర్వాత తాను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నదో కూడా వివరించారు.
గందరగోళ పరిచేలా ఉన్న ఆ పోస్టులో ఏముందో తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రేమ విఫలం కావడంతో తీవ్ర డెఫ్రిషిన్‌లోకి వెళ్లిన ఈ బ్యూటీ … ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ ఆ ఒత్తిడి ప్రభావం ఏదో ఆమెపై ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టు చదివితే అర్థమవుతుంది. ఇంతకూ తనకు తానుగా ఏమని వర్ణించుకున్నదో చూద్దాం.
‘నా హిప్ చాలా వెడల్పుగా ఉంటాయని అనుకునేదాన్ని. నా తొడలు చాలా పెద్దవిగా అనిపించేవి. నా నడుము సన్నగా ఉండేది కాదని, నా వక్షోజాలు అనుకున్నంత పెద్దవి కావని, నా ఉదరం చదునుగా లేదని, నా వెనుకభాగం పెద్దదిగా ఉందని, నా భుజా లు బలహీనంగా ఉంటాయని, ముక్కు వంకరగా ఉందని, పెదాలు అందంగా లేవని, నేను ఎత్తుగా లేనని తెగ బాధ పడేదాన్ని. నేను స్మార్ట్‌గా, పర్ఫెక్ట్‌గా లేదని అనుకుంటుంండేదాన్ని’ అని ఇలా చెప్పుకుంటూ ఇలియానా ఎక్కడికో వెళ్లిపోయారు. ఇక్కడితే ఆగిపోలేదు. ఇంకా అనేక విషయాలు తన శరీరం గురించి ఆమె చెప్పారు.
‘ఏది ఎలా ఉన్నా నేను పరిపూర్ణంగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. నాలోని ప్రతి మచ్చ, భయాన్ని విడిచిపెట్టి నన్ను నేను అందంగా తీర్చిదిద్దుకున్నాను. నా అందం నాదే అని భావించాను. ప్రపంచం అందం అని అనుకునేదాని గురించి ఆలోచించి నేనెందుకు ఆగాలి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.
అప్పుడు నాకెంతో తేలిక అనిపించింది. ప్రపంచ ఆలోచనలకు అనుగుణంగా రాజీ పడాలని నేను ఎందుకు ప్రయత్నించాలి అని ఆలోచించాను. ఆ క్షణాన నాకు నేనుగా నిలబడ్డాను’ అంటూ ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేశారు. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.