ఆ మధ్య బుల్లితెర నటులు నవ్యసామి, రవికృష్ణ, ప్రభాకర్, శివపార్వతి వరుసగా కరోనా బారిన పడ్డారు. దీంతో వాళ్లు నటిస్తున్న సీరియల్ షూటింగ్స్ అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. బుల్లితెరకు మళ్లీ అలాంటి కష్టం ఇప్పుడొచ్చింది. ఈసారి సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డంతో చాలా కార్యక్రమాల షూటింగ్స్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
2 రోజుల కిందట కరోనా బారిన పడ్డాడు సుడిగాలి సుధీర్. ఆ వెంటనే ఆయన హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. సుధీర్ కరోనా బారిన పడ్డంతో ఆయనతో టచ్ లోకి వచ్చిన ఇతర ఆర్టిస్టులంతా ఇప్పుడు హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. దీంతో చాలామటుకు నాన్-ఫిక్షన్ కార్యక్రమాలు ఆగిపోయాయి.
సుడిగాలి సుధీర్ ను పెట్టి ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది జీ తెలుగు. అటు ఈటీవీలో కూడా దీపావళి కోసం ఓ కొత్త కార్యక్రమం డిజైన్ చేశారు. వీటితో పాటు సుధీర్ ను పెట్టి ఆహా యాప్ డిజైన్ చేసిన ఓ కార్యక్రమం కూడా డైలమాలో పడింది. మరోవైపు ఎక్స్ ట్రా జబర్దస్త్ ఉండనే ఉంది.
కొన్ని రోజుల కిందట ఈటీవీకి దసరా కోసం చేసన ఓ స్పెషల్ ప్రొగ్రామ్ లో పాల్గొన్నాడు సుధీర్. అందులో దాదాపు సెలబ్రిటీలంతా పాల్గొన్నారు. శేఖర్ మాస్టర్, రష్మి, సంగీత, నవదీప్ తో పాటు జబర్దస్త్, ఢీ సభ్యులంతా ఉన్నారు. సుధీర్ కు పాజిటివ్ రావడంతో ఇప్పుడు వీళ్లు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి.