సాహో తరువాత దర్శకుడు సుజిత్ ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. ఇటీవలే డివివి దానయ్య నిర్మాణంలో ఓ సినిమాకు రెడీ అయ్యాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ అయింది. పవన్ కు అన్ని విధాలా మార్గదర్శకంగా వుండే త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహచర్యం కూడా సుజిత్ కు దొరికేసింది. ఆయన గైడెన్స్ లోనే కథ కూడా చేసేసాడు.
నిన్నటికి నిన్న పవన్ కు కథ చెప్పడం అది ఓకె అయిపోవడం జరిగిపోయింది. అంటే పవన్..సుజిత్..దానయ్య కాంబినేషన్ సినిమాకు ఓ పెద్ద హర్డిల్ తొలగిపోయింది. కథ చెప్పి వెనక్కు వచ్చిన సుజిత్ కు మళ్లీ మరోసారి పవన్ కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు షూట్ లో వున్నారు పవన్. ఆ షూటింగ్ కు వచ్చి తనతో లంచ్ కు జాయిన్ కావాలని సుజిత్ కు పవన్ నుంచి ఆహ్వానం అందిందట.
మొత్తానికి పవన్ దగ్గరకు చేరువ కావడం ఎలాగో సుజిత్ కనిపెట్టేసారు. త్రివిక్రమ్ అనే దగ్గర దారిని పట్టుకున్నారు. సక్సెస్ అయిపోయారు. అదే త్రివిక్రమ్ అనుగ్రహం లభించక ఓ దర్శకుడు కిందా మీదా అవుతున్నాడు పవన్ తో సినిమా చేయడానికి.