గత కొద్ది రోజులుగా ప్రచారంలో హడావుడి చేస్తున్న 18 పేజెస్ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని కలర్ ఇస్తూ వచ్చిన సినిమా ఒక్కసారిగా థ్రిల్లర్ టర్నింగ్ ఇచ్చుకుంది. కేవలం ఫీల్ గుడ్ లవ్ మాత్రమే కాదు..అంతకు మించి ఏదో వుందని ట్రయిలర్ లో కాస్త లీక్ ఇచ్చేసారు. నిఖిల్..అనుపమ కాంబినేషన్ లో సుకుమార్ కథతో, సూర్య ప్రతాప్ డైరక్షన్ లో బన్నీవాస్ నిర్మిస్తున్న సినిమా ఇది.
ట్రయిలర్ లో వున్న చమక్కు ఏమిటంటే కథ చాలా పెద్దది అనే ఇండికేషన్ ఇవ్వగలిగింది. ఎక్కడో ప్రారంభమై మరెక్కడికో వెళ్లింది. ఈ జర్నీలో ప్రేమ, పోరాటం.. పెయిన్..ఇలా చాలా అంటే చాలా వున్నాయి. అమ్మాయి డైరీలో వింటర్ అయితే హీరో సమ్మర్ లో స్వెర్టర్ వేసుకోవడం లాంటి చమక్కులు వున్నాయి. అనుపమ క్యూట్ గా కనిపిస్తూ, క్యూట్ గా డైలాగులు చెప్పడం వరకు బాగానే వుంది. కానీ ట్రయిలర్ లో టచ్ చేసిన వయిలెన్స్ చూస్తే మాత్రం కాస్త భయం వేస్తుంది.
సూర్యప్రతాప్ తన రెండు సినిమా కుమారి 21ఎఫ్ మాదిరిగా, తన గురువు సుక్కు మాదిరిగా కాస్త రగ్డ్ అండ్ రఫ్ సీన్లు సినిమాలో చొప్పించాడనే సందేహం కలుగుతుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో అలాంటి రగ్డ్ అండ్ రఫ్ సీన్లు తట్టుకోవాలంటే కాస్త కష్టమే. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కనుక అమ్మాయిలు అబ్బాయిలు కచ్చితంగా సినిమాకు వస్తారు. కానీ వాళ్లను ఆనందపరిచినంత వరకు ఫరవాలేదు. మరీ చూడలేని సీన్లు వుండకుండా చాలు.
గోపీసుందర్ చేసిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. బహుశా అందుకనేమో ట్రయిలర్ లో ఒక్క పాటను కూడా టచ్ చేయలేదు.