Advertisement

Advertisement


Home > Movies - Movie News

సుకుమార్...అవిశ్రాంతంగా

సుకుమార్...అవిశ్రాంతంగా

దర్శకుడు సుకుమార్ నిదానంగా సినిమాలు తీస్తారు. ఆయన గాభరా పడరు..గాభరా పెట్టకూడదు. ఇదీ ఇండస్ట్రీలో వినిపించే మాట. అలాంటిది ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టయిల్ మారిపోయింది. 

అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. పుష్ప సినిమా కు విడుదల డేట్ ఆగస్టు 13 అని ప్రకటించేసారు. కానీ సుకుమార్ వర్కింగ్ స్టయిల్ తెలిసిన వారు ఎవ్వరూ ఆ డేట్ కు వస్తుందని నమ్మడం లేదు.

పైగా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు ఆ డేట్ కు ఎలాగూ పుష్ప రాదు అని తమ సినిమాల కామ్ గా రెడీ చేసుకుంటున్నారు. కానీ సుకుమార్ మాత్రం ఆ డేట్ కు ఎలాగైనా రావాలనుకుంటున్నారు. అంతే కాదు బన్నీ ఎలాగైనా సినిమాను చకచకా పూర్తి చేయాల్సిందే అని గట్టి పట్టుగా వున్నారు. 

అందుకే ఈస్ట్ గోదావరిలో లెంగ్తీ షెడ్యూలు చేసిన తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే కేరళ వెళ్లిపోయింది పుష్ప టీమ్. సుకుమార్ అస్సలు గ్యాప్ తీసుకోకుండా పని చేస్తున్నారు. 

సుకుమార్ ఇంట్లో బుధవారం ఓ ఫంక్షన్ వుంది. అయినా కూడా ముందుగా రాకుండా బుధవారం ఉదయం మాత్రమే వచ్చి, మళ్లీ ఫంక్షన్ అయిన వెంటనే కేరళ వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ లెక్కన చూస్తుంటే ఆగస్టు 13 డేట్ ను పుష్ప మిస్ కాదేమో?

త్వరలోనే తెలుగులో మాట్లాడుతా

ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?