బన్నీ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చింది దేశముదురు సినిమా. మరి ఇదే సినిమాలో హీరోగా సుమంత్ నటిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టాడు సుమంత్. దేశముదురు సినిమా ముందుగా తనకే వచ్చిందని చెప్పుకొచ్చాడు.
పూరి జగన్నాధ్ ముందుగా దేశముదురు సినిమాను సుమంత్ కే వినిపించాడట. అయితే తన బాడీలాంగ్వేజ్ కు ఆ సినిమా సెట్టవ్వదని, సుమంత్ తిరస్కరించాడట. నిజంగా తను దేశముదురు సినిమా చేసి ఉంటే, అది అట్టర్ ఫ్లాప్ అయ్యేదని ఓపెన్ చెప్పుకొచ్చాడు ఈ హీరో.
“యాక్టర్‌గా చాలా కథలు వింటుంటాను. అయితే అన్ని కథలకు నేను సూట్ అవుతానని అనుకోను. నెరేషన్ తొలి అర్థగంటలోనే సినిమా నాకు సూట్ అవుతుందో లేదో క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ నాకు ఆ కథ సూట్ కాకపోతే, ఎవరికి ఆ కథ సూట్ అవుతుందో వారి దగ్గరకి నేను ఆ కథను వినమని పంపిస్తాను.”
ఇలా కథల విషయంలో తన క్లారిటీని బయటపెట్టాడు సుమంత్. మళ్లీ రావా తర్వాత అదే తరహాలో రొమాంటిక్ కథలొస్తాయని తను ఊహించానని, కానీ ఆశ్చర్యంగా థ్రిల్లర్ కథలు రావడం స్టార్ట్ అయ్యాయని చెప్పుకొచ్చాడు.
ఈ హీరో నటించిన కపటధారి సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కన్నడ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన కపటధారిపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు సుమంత్.