Advertisement

Advertisement


Home > Movies - Movie News

సునీల్ కు మరో చాన్స్

సునీల్ కు మరో చాన్స్

హీరో పాత్రలను పక్కన పెట్టి, రకరకాల పాత్రలను ట్రయ్ చేస్తూ, ఇండస్ట్రీలో ఎలాగైనా మళ్లీ నిలదొక్కుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు సునీల్. కానీ సరైన పాత్ర పడడం లేదు. మిత్రుడు త్రివిక్రమ్ కూడా అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో సరైన పాత్రలు ఇవ్వలేదు. రాయలేదు. 

వేరే సినిమాల్లో వచ్చిన పాత్రలు అంతగా పండలేదు. డిస్కోరాజాలో ట్విస్ట్ ఇచ్చి, విలన్ గా టర్నింగ్ ఇచ్చుకున్నాడు. సినిమా సంగతి ఎలా వున్నా, సునీల్ ట్విస్ట్ దగ్గర మాత్రం కాస్త డిఫరెంట్ గా పీలయ్యారు. నిజానికి ఈ సినిమా మీద సునీల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా విజయం సాధించకపోవడంతో ఈ పాత్ర జనాలకు చేరలేదు.

ఇప్పుడు మళ్లీ మరోసారి ట్రయ్ చేయడానికి సునీల్ కు ఇంకో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్యతో చేస్తున్న సినిమాలో దర్శకుడు బోయపాటి ఓ పాత్రను సునీల్ కు ఆపర్ చేసినట్లు తెలుస్తోంది. జస్ట్ హీరో పక్కన వుండే రొటీన్ కమెడియన్ పాత్రనో లేదా మరోటో అన్నది ఇంకా క్లారిటీ లేదు. బోయపాటి అయినా కనీసం సునీల్ కు సరైన లిఫ్ట్ ఇస్తారేమో చూడాలి.

రామోజీరావుని సూటిగా అడుగుతున్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?