Advertisement

Advertisement


Home > Movies - Movie News

తమన్న.. ఈసారి మరింత కొత్తగా

తమన్న.. ఈసారి మరింత కొత్తగా

సిల్వర్ స్క్రీన్ పై మిల్కీబ్యూటీకి మంచి పాత్రలే దక్కాయి. బాహుబలి, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో ఆమె పాత్రలు బాగా క్లిక్ అయ్యాయి. అయితే అంతకుమించి కోరుకుంటోంది తమన్న. అందుకే వెబ్ డ్రామాలకు ఓకే చెబుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 వెబ్ సిరీస్ లు చేసిన తమన్న, ఇప్పుడు ముచ్చటగా మూడో సిరీస్ కు ఓకే చెప్పింది.

అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతోంది మిల్కీబ్యూటీ. దీనికి యారీ దోస్తీ అనే టైటిల్ అనుకుంటున్నారు. అరుణిమ శర్మ డైరక్ట్ చేయబోతున్న ఈ సిరీస్ లో తమన్న నెగెటివ్ షేడ్స్ కలిగిన లవర్ పాత్రలో కనిపించబోతోంది.

తొలిసారి ట్రై చేసిన లెవెన్త్ అవర్ లో బిజినెస్ ఉమెన్ గా కనిపించింది తమన్న. ఆ తర్వాతొచ్చిన నవంబర్ స్టోరీలో ఎథికల్ హ్యాకర్ గా నటించింది. ఇప్పుడీ మూడో వెబ్ డ్రాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన ప్రేయసిగా కనిపించబోతోంది. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంపిక చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఫస్ట్ వెబ్ సిరీస్ ను తెలుగులో, రెండో వెబ్ సిరీస్ తమిళ్ లో చేసిన తమన్న.. ఈ మూడో వెబ్ డ్రామాను హిందీలో చేయబోతోంది. సెప్టెంబర్ నుంచి ఇది సెట్స్ పైకి వస్తుంది. ఈ గ్యాప్ లో గుర్తుందా శీతాకాలం, ఎఫ్3 సినిమాల్ని పూర్తిచేయబోతోంది ఈ బ్యూటీ. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?