Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్టార్స్ లేరు.. స్టార్ డమ్ కూడా లేదు - తమన్న

స్టార్స్ లేరు.. స్టార్ డమ్ కూడా లేదు - తమన్న

హీరో, హీరోయిజం, హీరోయిన్, ఫ్యాన్ బేస్ లాంటి ఎలిమెంట్స్ కు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిందంటోంది తమన్న. ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్ డమ్, స్టార్స్ ప్రాభవం తగ్గిందని చెబుతోంది. 

"7-8 ఏళ్ల కిందట నాకు స్టార్ డమ్ వచ్చినప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి. సౌత్ లో అభిమానగణం ఎక్కువ. ఏళ్లుగా స్టార్స్ ను అభిమానిస్తుంటారు. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత స్టార్ డమ్ మసకబారింది. హీరోయిజం కాస్త తగ్గింది."

సినిమాలతో పోలిస్తే, ఓటీటీలో పోటీ ఎక్కువంటోంది తమన్న. ఎందుకంటే ఓటీటీలో కుప్పలుతెప్పలుగా స్టఫ్ అందుబాటులో ఉంటుందని, పైగా చాలా ఫాస్ట్ గా ట్రెండ్స్ మారిపోతుంటాయని చెబుతోంది. 

"ఓటీటీలో నటీనటులకు ఎప్పుడూ టాప్ లో ఉండడం అవసరం. ప్రతిసారి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఓటీటీలో కుప్పలుతెప్పలుగా కంటెంట్ ఉంది. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతుంటాయి. నటులుగా మనం వాటిని తెలుసుకోవాలి, అందిపుచ్చుకోవాలి."

ఒకప్పుడు హీరోలు ఇలానే ఉండాలి, హీరోయిన్లు ఇలానే కనిపించాలనే కొలతలు-లెక్కలు ఉండేవని.. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత కథలు, హీరోహీరోయిన్లు క్యారెక్టరైజేషన్లు మారిపోయాయని అంటోంది తమన్న. నిజానికి ఓటీటీలో హీరో, హీరోయిన్ అనే కాన్సెప్ట్ కూడా లేదంటోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?