నా పేరెంట్స్ కు లేని తొందర మీడియాకు ఎందుకు?

మిల్కీ బ్యూటీ తమన్న తన పెళ్లిపై స్పందించింది. తన పెళ్లి విషయంలో తల్లిదండ్రుల కంటే మీడియా ఎక్కువగా తొందర పడుతోందని, అంత తొందర పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. Advertisement “మీడియా దృష్టిలో…

మిల్కీ బ్యూటీ తమన్న తన పెళ్లిపై స్పందించింది. తన పెళ్లి విషయంలో తల్లిదండ్రుల కంటే మీడియా ఎక్కువగా తొందర పడుతోందని, అంత తొందర పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

“మీడియా దృష్టిలో నాకు ఓ డాక్టర్ తో ఆల్రెడీ పెళ్లయిపోయింది. అదే మీడియా దృష్టిలో ఓ వ్యాపారవేత్తతో కూడా నాకు పెళ్లయిపోయింది. ఇలా మీడియా ముందే నా పెళ్లి చేసేసింది. నిజానికి నాకు, నా తల్లిదండ్రులకు పెళ్లి విషయంలో తొందర లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అది కచ్చితంగా జరుగుతుంది.”

ఇలా తన పెళ్లిపై స్పందిస్తూనే, మీడియాపై సెటైర్లు వేసింది తమన్న. తనతో పాటు ఇండస్ట్రీకొచ్చిన చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారని, తను మాత్రం ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ నిజజీవితంలో పెళ్లి చేసుకునే రోజు వస్తే, ఆ విషయాన్ని మీడియాకు తప్పకుండా చెబుతానంటోంది ఈ బ్యూటీ.

తమన్నతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన నయనతార, కాజల్ లాంటి చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. దీంతో తమన్నపై అనుకోని వత్తిడి పెరిగింది. పైగా వయసు కూడా 30 దాటడంతో, మీడియా ఎదురుపడిన ప్రతిసారి ఇదే ప్రశ్న ఎదురవుతోంది. అయితే తమన్న మాత్రం ఎప్పట్లానే పెళ్లి విషయంలో తప్పించుకుంది.