హీరోయిన్ల ఎఫైర్లు దాగవు. ఈమధ్య హీరోయిన్లే స్వయంగా తమ ఎఫైర్లను బయటపెడుతున్నారు కూడా. ప్రస్తుతం తమన్న అదే పనిలో ఉన్నట్టుంది. తమన్న-విజయ్ వర్మ డేటింగ్ ముచ్చట మొన్నటివరకు గాసిప్స్ కే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు బయటకొస్తున్నారు. కెమెరాలకు పోజులు కూడా ఇస్తున్నారు. తాజాగా మరోసారి చిక్కారు.
తమన్న, విజయ్ వర్మ కొన్నాళ్లుగా కలిసి తిరుగుతున్నారు. తమ ప్రేమ విషయాన్ని వీళ్లు బయటకు చెప్పనప్పటికీ, ఎక్కడ చూసినా కలిసి కనిపిస్తున్నారు. తాజాగా ఇద్దరూ కలిసి ముంబయిలో ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లారు కూడా.
డిన్నర్ పూర్తయిన తర్వాత స్వయంగా తన కారులో తమన్నాను విజయ్ వర్మ ఇంటికి తీసుకెళ్లాడు. అదే టైమ్ లో కెమెరాలు క్లిక్ మన్నాయి. ఈసారి మాత్రం ఈ జంట సిగ్గుపడలేదు, ముఖం చాటేయలేదు. ఎంచక్కా కెమెరాలకు హాయ్ కూడా చెప్పారు.
న్యూఇయర్ పార్టీ సందర్భంగా తొలిసారి తమన్న-విజయ్ రిలేషన్ షిప్ బయటపడింది. ఏకంగా విజయ్ కు లిప్ కిస్ ఇస్తున్న ఫొటో బయటకొచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. మరో సందర్భంలో ముంబయిలో ఓ సినీ వేడుకకు కలిసి హాజరయ్యారు. తాజాగా ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ ఎంజాయ్ చేశారు.
చూస్తుంటే, రేపోమాపో తమ రిలేషన్ షిప్ ను వీళ్లిద్దరూ బయటపెట్టేలా ఉన్నారు. అయితే వీళ్ల రిలేషన్ షిప్ కు తమన్న తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరం ఎదురవుతోందనేది తాజా గాసిప్.