cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

టిడిపి నన్ను సస్పెండ్ చేయడం ఏమిటి?

టిడిపి నన్ను సస్పెండ్ చేయడం ఏమిటి?

చంద్రబాబు నన్ను సస్పెండ్ చేయడం ఏమిటి? గాడిదగుడ్డు అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మండిపడ్డారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని, అయినా ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగుదేశం నేతల బతుకు ఏమిటో తనకు తెలుసునని ఆయన అన్నారు. తానేమీ పప్పు ను కాదని, తాను పప్పు తినడం లేదని ఆయన అన్నారు.

తన దిష్టిబొమ్మ దగ్దం చేసినంతమాత్రాన తన ప్రతిష్ట ఏమీ పోదని ఆయన అన్నారు. చంద్రబాబు కు మతి చలించి మాట్లాడుతున్నారని వంశీ మండిపడ్డారు.

తాను ప్రెస్ కాన్పరెన్స్ పెట్టిన తర్వాత పోటోలు మార్ప్ చేసి,అశ్లీల పోటోలు కూడా పెట్టి సర్కులేట్ చేస్తున్నారని, దీనిపై పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేశానని ఆయన అన్నారు.

తాను పనికిమాలినవాడినికాని, వారసత్వంగా రాజకీయాలలోకి రాలేదని, తాను వాస్తవాలు అనుకునే మాట్లాడానని అన్నారు.