దసరాకు పోటా పోటీగా విడుదలవుతున్నాయి. టైగర్ టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఇటు ఫ్యాన్స్ సంగతి అలా వుంటే రవితేజ ఫ్యాన్స్ నుంచి రకరకాల పోస్ట్లు మొదలయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు అయిదు రవితేజ-బాలయ్య సినిమాలు పోటా పోటీగా విడుదలైనపుడల్లా విజయం రవితేజ దే అయింది. అందువల్ల ఈసారీ గెలుపు రవితేజ దే అంటూ హడావుడి చేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్.
అయితే ఈ సారి ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈసారి రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం లేదు ఒక రోజు గ్యాప్ తో విడుదలవుతున్నాయి. పైగా గతంలో బాలయ్య సినిమాలు వేరు, ఇప్పుడు వేరు. బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
రవితేజ ప్రస్తుతం ఫ్లాప్ లైన్ లో వున్నారు. టైగర్ సినిమా హిట్ కొట్టి తీరాలి. టీజర్ వరకు చూసుకుంటే దర్శకుడు వంశీకృష్ణ బాగానే వర్క్ చేసినట్లు కనిపిస్తోంది. టైగర్ టీజర్ తో చూసుకుంటే బాలయ్య కేసరి సినిమా టీజర్ రెగ్యులర్ పాట్రన్ లోనే వుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారి తన సేఫ్ జానర్ వదిలి అగ్రెసివ్ సినిమా చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ అన్నది ఈ సినిమా నుంచి ఎక్కువ కాదు కానీ పెద్దగా ఎక్స్ పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే బాలయ్య పాత్ర, ఆ కథ అలాంటిది. ఇది క్లిక్ అయితే అనిల్ రావిపూడి రూటు పూర్తిగా మారే అవకాశం వుంది.
టైగర్ దర్శకుడు వంశీకృష్ణ కు పెద్దగా ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ఈ సినిమాతోనే దర్శకుడు వంశీ ప్రూవ్ చేసుకోవాల్సి వుంటుంది.
ఇలా రెండు సినిమాలకు బోలెడు ప్లస్ లు వున్నాయి. క్రేజ్ కూడా వుంది.
కానీ ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా వుంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా లియో కూడా ఇదే టైమ్ లో విడుదలవుతోంది. కొత్త మేకింగ్.. కొత్త టోన్.. కొత్త సౌండ్ ను ఇష్టపడుతున్నారు ఇప్పుడు మన ఆడియన్స్. ఆ ఫ్యాక్టర్ లో చూసుకుంటే లియో గట్టి పోటీ ఇస్తుందనుకోవాలేమో?