జీవితంలో ఇక పెళ్లి చేసుకోనంటోంది హీరోయిన్ తేజశ్వి. అయితే బాయ్ ఫ్రెండ్ ను మాత్రం మెయింటైన్ చేస్తానంటోంది. పెళ్లికి బాయ్ ఫ్రెండ్ కు సంబంధం లేదంటోంది.
గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇలా చాలా విషయాలపై బోల్డ్ గా మాట్లాడింది తేజశ్వి. లిప్ కిస్ విషయాలతో పాటు రియల్ లైఫ్ లో జరిగిన కమిట్ మెంట్లు బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూ లోంచి కొన్ని పాయింట్స్ మీకోసం..
– నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ నిజమైన లిప్ కిస్ పెట్టాను. అంతకుముందు నేను చేసిన లిప్ కిస్సులు ఫేక్. కానీ కమిట్ మెంట్ సినిమాలో మాత్రం నిజంగా లిప్ కిస్సు పెట్టాను. మొదటి ముద్దు ఎవరికో పెట్టడం ఎందుకని, నాకు తెలిసిన ఫ్రెండ్ నే హీరోగా పెట్టుకున్నాను. ఫస్ట్ లిప్ కిస్సు అనుభవం చాలా బాగుంది. అదొక అందమైన అనుభూతి.
– నేను తెలుగు అమ్మాయినే. పెళ్లి చేసుకోవాలని కలలుకన్నాను. ఆమధ్య పెళ్లికి రెడీ అయ్యాను. కానీ అది కాన్సిల్ అయింది. దాంతో తీర్థయాత్రకు వెళ్లాను. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఓ ఆర్టిస్టుగా ముందుకెళ్లాలంటే పెళ్లి చేసుకోకూడదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోను.
– పెళ్లి చేసుకోకపోయినా బాయ్ ఫ్రెండ్ ను ఉంచుకోవచ్చు. అందులో తప్పులేదు. నేను సన్యాసం తీసుకోలేదు కదా. కాబట్టి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. గతంలో ఇద్దరితో డేటింగ్ చేశాను. దాదాపు పదేళ్లు నడిచింది వ్యవహారం. ఇప్పుడు బాగా మెచ్యూర్ అయ్యాను.
– నేను సాత్వికం కాదు.. అంతా నన్ను బూతులు తిడుకుంటే తప్పు నాలోనే ఉందేమో అనుకున్నాను. నన్ను నేను మార్చుకోవడం కోసం తీర్థయాత్రకు వెళ్లాను. అక్కడ తెలుసుకున్నదేంటంటే.. నన్ను నేను మార్చుకోలేను. నేనింతే. ఇలానే మాట్లాడతాను.
– సినిమాలో నా క్యారెక్టర్ చూసి ప్రతి హీరోయిన్ తనను తాను చూసుకుంటుంది. ఆడిషన్స్, రెమ్యూనరేషన్, కమిట్ మెంట్.. ఇలా అన్నీ చూపించేశాం.
– కమిట్ మెంట్ ఇవ్వమని వంద మంది అడుగుతారు. నైట్ కు వెళ్లి అది చేశామా లేదా అనేది నా ఛాయిస్. కానీ నన్ను ఎవ్వరూ అడగలేదు, నేనేం చేయలేదు అని చెప్పడం అబద్ధం. చాలా మంది పెద్ద హీరోయిన్లు తమను ఎవ్వరూ కమిట్ మెంట్ అడగలేదని, అలాంటి పని చేయలేదని అంటుంటారు. నిజంగా అది వాళ్ల అదృష్టం. నాకు మాత్రం జరిగింది.