దిల్ రాజు చేయాల్సిన పని తమన్ చేశాడు

గేమ్ ఛేంజర్.. ఈ సినిమా విడుదల ఎప్పుడు? అడిగిన ప్రతిసారి క్రిస్మస్ రిలీజ్ అంటారు దిల్ రాజు. అంతకుమించి ఆయనేం చెప్పరు. ఆయన ఆమాత్రం చెప్పడమే గొప్ప విషయం అన్నట్టు సర్దుకుపోయారు మెగాభిమానులు. Advertisement…

గేమ్ ఛేంజర్.. ఈ సినిమా విడుదల ఎప్పుడు? అడిగిన ప్రతిసారి క్రిస్మస్ రిలీజ్ అంటారు దిల్ రాజు. అంతకుమించి ఆయనేం చెప్పరు. ఆయన ఆమాత్రం చెప్పడమే గొప్ప విషయం అన్నట్టు సర్దుకుపోయారు మెగాభిమానులు.

దిల్ రాజు చేయాల్సిన పనిని, తమన్ పూర్తిచేశాడు. గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఇవ్వడంతో పాటు, సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేశాడు. అక్టోబర్ 1 నుంచి గేమ్ ఛేంజర్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలుపెడతానని తెలిపిన తమన్.. డిసెంబర్ 20న సినిమా రిలీజ్ అవుతుందని తేల్చేశాడు.

వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ కోసం అన్-స్టాపబుల్ ఈవెంట్స్ ప్లాన్ చేసినట్టు వెల్లడించాడు. తమన్ పెట్టిన ప్రతి పోస్టును దిల్ రాజు బ్యానర్ ట్విట్టర్ హ్యాండిల్ రీపోస్ట్ చేసింది. అంటే దీనర్థం.. డిసెంబర్ 20 రిలీజ్ పక్కా అని.

అంతా బాగానే ఉంది.. గేమ్ ఛేంజర్ లాంటి సినిమా విడుదల తేదీని ఇలా ప్రకటించడం బాగాలేదు. అదేదో అఫీషియల్ గా ఎనౌన్స్ చేయొచ్చుగా..! ఈ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి కీలకమైన అప్ డేట్ ను తమన్ ట్వీట్స్ తో కలిపేసి చెప్పడం వింతగా ఉంది.

చూస్తుంటే.. మేకర్స్ కావాలనే ఈ వ్యూహాన్ని అనుసరించినట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 20 రిలీజ్ అనే విషయాన్ని ఫీలర్ గా వదిలి, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించే ఆలోచన దీని వెనక కనిపిస్తోంది. కాకపోతే ఇదంతా ఎందుకనేది అర్థంకాని విషయం.

7 Replies to “దిల్ రాజు చేయాల్సిన పని తమన్ చేశాడు”

Comments are closed.