థియేటర్లు..తెరవెనుక సంగతులు

సంక్రాంతికి థియేటర్ల సమస్య ఏమేరకు ఉందో ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. వస్తున్నాయి. కేవలం సినిమా పెద్దలు.. వాళ్ల చేతుల్లో వున్న థియేటర్లు..వీటి గురించే నడుస్తోంది అంతా. కానీ అంతకు మించి జరుగుతోంది తెరవెనుక. …

సంక్రాంతికి థియేటర్ల సమస్య ఏమేరకు ఉందో ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. వస్తున్నాయి. కేవలం సినిమా పెద్దలు.. వాళ్ల చేతుల్లో వున్న థియేటర్లు..వీటి గురించే నడుస్తోంది అంతా. కానీ అంతకు మించి జరుగుతోంది తెరవెనుక. 

రెండు రాష్ట్రాల్లో అనేక సింగిల్ స్క్రీన్స్ వున్నాయి. వీటిల్లో చాలా వరకు యజమానులే రన్ చేస్తున్న స్క్రీన్ లు వున్నాయి. లీజుకు ఇచ్చినవి వున్నాయి. ఇప్పటి వరకు నూటికి నూరుశాతం థియేటర్లు ఏదో సినిమాకు అంటూ అగ్రిమెంట్ లు అయిపోలేదు. అందుకే తెరవెనుక చాలా అంటే చాలా రికమెండేషన్లు, లాబీయింగ్ ఇలా చాలా జరుగుతోంది.

ఇటు మెగాస్టార్ తరపున, అటు బాలయ్య తరపున ఇండస్ట్రీ జనాలు కొందరు వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. బాలయ్య తరపున నిర్మాత ప్రసన్న ఓపెన్ గానే వర్క్ చేస్తున్నారు. ఇవి చాలక కొన్ని చోట్ల ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. మెగాస్టార్ తరపున ఫ్యాన్స్ సంఘ కీలక వ్యక్తులు థియేటర్ల యజమానులను సంప్రదించి తమ బాస్ సినిమాకు థియేటర్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఇక లోకల్ డిస్ట్రిబ్యూటర్లు అయితే తమకు తెలుసున్న ఎమ్మెల్యేలను పట్టుకుని, వాళ్ల ద్వారా థియేటర్ల యజమానులకు ఫోన్ లు చేయిస్తున్నారు. ఇవన్నీ చూసి ఎగ్జిబిటర్లు భలే ఆట నడుస్తోందని సంబరపడుతున్నారు. మామూలుగా అయితే ఇంత భారీ సినిమాలు, సంక్రాంతి సీజన్ అయితే థియేటర్ల నుంచి భారీ అడ్వాన్స్ లు వెళ్లాలి. ఇప్పుడు అడ్వాన్స్ లు ఇవ్వడం సంగతి అలా వుంచితే, థియేటర్ ఇస్తే రెండు వారాల రెంట్ డబ్బులు ముందే ఇస్తామన్న ఆఫర్లు కూడా వస్తున్నాయి.

ఈ నెల 11న రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. 12న ఒక సినిమా, 13న ఒక సినిమా వుంటాయి. 14న కూడా సినిమా వుంది. అయిదు సినిమాలు ఈ సంక్రాంతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.