ఆ స్వీట్ సర్ ప్రైజ్ అదేనా బన్నీ

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి మూడో పాట రాబోతోంది. బాలల దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు మూడో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు బన్నీ. Advertisement #OMGDaddy అనే లిరిక్స్…

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి మూడో పాట రాబోతోంది. బాలల దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు మూడో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు బన్నీ.

#OMGDaddy అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో ఓ స్పెషల్ స్వీట్ సర్ ప్రైజ్ కూడా ఉంటుందని అంటున్నాడు. అయితే ఆ సర్ ప్రైజ్ ఏంటనేది ముందుగానే బయటకొచ్చింది.

అల వైకుంఠపురములో మూడో లిరికల్ వీడియోలో బన్నీతో పాటు అతడి కొడుకు, కూతురు కూడా కనిపించబోతున్నారు. కొడుకు అయాన్, కూతురు అర్హతో కలిసి బన్నీ ఈ సాంగ్ లో కనిపించబోతున్నాడు.

అయితే మేకింగ్ వీడియోస్ లో భాగంగా అయాన్-అర్హ కనిపిస్తారా.. లేక సినిమాలో వాళ్లు కూడా ఉన్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. స్వీట్ సర్ ప్రైజ్ మాత్రం ఇదే.

ఇక ఈ పాటపై కూడా భారీగా అంచనాలున్నాయి. ఎందుకంటే సినిమాకు సంబంధించి ఇప్పటికే సామజవరగమన అనే పాట పెద్ద హిట్ అయింది. ఫోక్ స్టయిల్ లో సాగే రాములో రాముల అనే పాట కూడా హిట్ అయింది.

ఇలా రెండు పెద్ద హిట్ సాంగ్స్ తర్వాత వస్తున్న సాంగ్ కావడంతో.. ఓ మై గాడ్ డాడీ అనే ఈ మూడో పాటపై కూడా అంచనాలు బాగా పెరిగిపోయాయి.