దేవర టైటిల్ అదిరింది. ఎన్టీఆర్-కొరటాల కాంబో పాన్ ఇండియా సినిమాకు సరైన టైటిల్. అందులో సందేహం లేదు. కానీ ఫస్ట్ లుక్ ఎలా వుంది? అదీ పాయింట్.
ఏమన్నా కొత్తగా వుందా? ఎన్టీఆర్ ఏవైనా ఫంక్షన్లకు వస్తే, చికాగ్గా, సీరియస్ గా మొహంలో ఫీలింగ్స్ కనబరిస్తే ఎలా వుంటుందో..అలాగే వుంది. వాస్తవానికి ఎన్టీఆర్ ఫేస్ కు ఇలాంటి చికాకు లుక్ సెట్ కాదు. నిజానికి కొరటాల మొదటి నుంచి చెబుతున్నది ఏమిటి?
భయానికే భయం పుట్టించేంత మనిషి..ఇంత..అంత అని చెబుతూ వచ్చారు. కానీ ఇక్కడ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే రౌద్రం, భయానకం ఇలాంటివి ఏవీ లేవు. జస్ట్ సీరియస్ నెస్ మాత్రమే కనిపిస్తోంది. పైగా ఇలాంటి ఫస్ట్ లుక్స్ లాంటివి కాస్త బెటర్ క్లోజ్ అప్ ఇస్తే వేరుగా వుంటుంది.
ఇంటెన్సిటీ తెలియాలంటే ఇంకా బెటర్ గా చేసి వుండాల్సింది. పైగా ఎన్టీఆర్ ఫేస్, గెటప్ లో పెద్దగా మేకోవర్ లేదు. బ్లాక్ డ్రెస్ అన్నది ఈ మధ్య చాలా మంది హీరోలకు కామన్ అయిపోయింది. లేటెస్ట్ గా బాలయ్యను ఇలా బ్లాక్ పంచె, షర్ట్ లో చూసేసాం కూడా.
మొత్తం మీద హడావుడి, ఫ్యాన్స్ ఎదురుచూపులు తప్పిస్తే, ఆ రేంజ్ ఫస్ట్ లుక్ అయితే రాలేదు. ముందు ముందు సరైన కంటెంట్ వస్తుందని సరిపెట్టుకోవాల్సిందే.