సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే బడా హీరోలంతా షూటింగ్స్ తగ్గించేస్తారు. మహేష్ లాంటి హీరోలైతే విదేశాలకు వెళ్లిపోతుంటారు. కానీ ఈసారి సమ్మర్ కాస్త ప్రత్యేకం. హీరోలంతా ఈ వేసవిలో షూటింగ్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కాల్షీట్లు కూడా కేటాయించారు.
ఎప్పట్నుంచో పుష్ప-2 పనిమీద ఉన్నాడు అల్లు అర్జున్. ఎట్టకేలకు ఈ వేసవిలో ఆ సినిమాను ఓ కొలిక్కి తీసుకురాబోతున్నాడు. ఆగస్ట్ 15న పుష్ప-2 రిలీజ్ కావాలంటే, ఏప్రిల్ నెలాఖరుకు టోటల్ షూటింగ్ పూర్తవ్వాలి.
రామ్ చరణ్ కూడా ఈ వేసవిలో పనిచేయబోతున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్న ఈ నటుడు, శంకర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి చేసి, వెంటనే బుచ్చిబాబు సినిమాను ప్రారంభించాలనేది ఆలోచన.
ఎన్టీఆర్ కూడా రెస్ట్ తీసుకోవడం లేదు. దేవర షూటింగ్ ఇప్పటికే ఆలస్యమైంది. ఏప్రిల్ 5 టార్గెట్ ను మిస్సయ్యారు. సో.. సమ్మర్ లో కూడా పని చేయాల్సిందే. అటు మహేష్ కూడా ఈ వేసవిలో పనిచేయబోతున్నాడు. సెట్స్ పైకి రాకపోయినా, రాజమౌళితో కలిసి పలు వర్క్ షాప్స్ లో పాల్గొంటాడు. ఇప్పటికే జర్మనీ వెళ్లి వచ్చాడు. ఈ సమ్మర్ లో మహేష్ కోసం ఆల్రెడీ కార్యాచరణ సిద్ధం చేసి పెట్టాడు రాజమౌళి. తన హీరోల్ని రాజమౌళి, ఖాళీగా ఉండనివ్వడు కదా.
ఇక ప్రభాస్ గురించి చెప్పేదేముంది. ఆల్రెడీ చేతిలో కల్కి, రాజాసాబ్, సలార్-2 సినిమాలున్నాయి. ఈ వేసవిలో ఈ 3 సినిమాలతోనే సరిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ సమ్మర్ లోనే సలార్-2 స్టార్ట్ అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ హీరోలతో పాటు విశ్వంభర సినిమాతో చిరంజీవి, తన కొత్త సినిమాతో బాలకృష్ణ, ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ, తండేల్ తో నాగచైతన్య ఆల్రెడీ బిజీగా ఉన్నారు. ఇలా ఈ సమ్మర్ లో హీరోలంతా గ్యాప్ తీసుకోకుండా పనిచేయబోతున్నారు.