టాలీవుడ్ కు జగన్ వరాలు

టాలీవుడ్ పెద్దలు ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలిసారు. సుమారు అరగంట సేపు వారు ఆయనతో ముచ్చటించారు. ఇండస్ట్రీ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.  ఇండస్ట్రీ ప్రతినిధులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి,…

టాలీవుడ్ పెద్దలు ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలిసారు. సుమారు అరగంట సేపు వారు ఆయనతో ముచ్చటించారు. ఇండస్ట్రీ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.  ఇండస్ట్రీ ప్రతినిధులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, పివిపి తదితరులు ఈ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ను కలిసారు. ఆయన వీరిని చాలా బాగా రీసీవ్ చేసుకున్నారు. జగన్ తమను రిసీవ్ చేసుకున్న పద్దతి అదీ చూసి వెళ్లిన ఇండస్ట్రీ జనాలు ఫిదా అయిపోయారు. సుమారు ఇరవై నిమషాలకు పైగా ముఖ్యమంత్రి తో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలు సమస్యలను సిఎమ్ దృష్టికి తేగా ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు బోగట్టా. టికెట్ రేట్లపై ప్రతి సారీ కోర్టులు వెళ్లాల్సి వస్తోందని, ఫ్లెక్సీ రేట్లు అమలు చేస్తే బాగుంటుందని, అది ఎలాఅన్నది దర్శకుడు రాజమౌళి వివరించారు. ఆ మేరకు తాను ఆలోచిస్తానని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

గత మూడు నెలల కాలంలో థియేటర్లకు ఆదాయం లేదని, కరెంటు బిల్లలను రద్దు చేస్తే కాస్త ఉపశమనంగా వుంటుందని దిల్ రాజు కోరారని తెలుస్తోంది. తప్పకుండా పరిశీలిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

గత అయిదేళ్లుగా నంది అవార్డుల ఫంక్షన్ జరగడం లేదని ఇండస్ట్రీ జనాలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తప్పకుండా చేద్దామని, అలాంటి ఫంక్షన్ ఒకటి ఏటా జరపడం అవసరం కూడా అని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

గతంలో విశాఖలో కొన్ని భూముల కేటాయింపులు చేసారని, ఆ తరువాత అది మరింత ముందుకు వెళ్లలేదని టాలీవుడ్ పెద్దలు చెప్పగా తప్పకుండా పరిశీలిస్తానని చెప్పినట్లు బోగట్టా. ఇదిలా వుంటే విశాఖ లో కూడా అన్ని విధాలా చిత్రపరిశ్రమను అభివృద్ది చేయాలని తనకు వుందని, ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ మాదిరిగా అక్కడ కూడా తయారు కావాలని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. 

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు