‘శ్యామ్ సింగ రాయ్’పై అగ్ర నిర్మాత కన్ను!

నాని హీరోగా అనౌన్స్ అయిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం నుంచి నిర్మాత నాగవంశీ తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ మరో నిర్మాత వెంకట్ బోయినపల్లి చేతికి వెళ్లింది. ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ అవుతుందనే…

నాని హీరోగా అనౌన్స్ అయిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం నుంచి నిర్మాత నాగవంశీ తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ మరో నిర్మాత వెంకట్ బోయినపల్లి చేతికి వెళ్లింది. ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ అవుతుందనే భావనతో నాగవంశీ వైదొలగగా, సబ్జెక్ట్ మీద నమ్మకంతో నాని మరో నిర్మాతకు బాధ్యతలు అప్పగించాడు. 

ఇదిలావుంటే ఈ చిత్రం పట్ల ఓ అగ్ర నిర్మాత ఆసక్తిగా వున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు నిర్మాతకు నానితో మంచి రిలేషన్ వుండడంతో పాటు బడ్జెట్ ఎక్కువ అవుతుందనే టాక్ వుండడంతో తానయితే బెస్ట్ ఆప్షన్ అవుతానన్నట్టుగా నానికి సంకేతాలు పంపించినట్టు భోగట్టా. 

ఈ రూమర్లలో వాస్తవం ఎంత అనేది తెలియదు. అయితే ఇంతవరకు ఈ చిత్రాన్ని కాన్సిల్ చేసుకున్నట్టు నాగ వంశీ నుంచి కానీ, ఈ చిత్రం మరో నిర్మాత చేస్తున్నాడనే న్యూస్ నాని తరఫునుంచి కానీ అధికారికంగా బయటకు రాలేదు. 

ఇదిలావుంటే నాని నటిస్తోన్న టక్ జగదీష్ షూటింగ్‌లో ముఖ్య టెక్నీషియన్‌కు కరోనా సోకడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపేసి మళ్లీ అన్ని జాగ్రత్తలు తీసుకుని మొదలు పెట్టారు. ఆ సినిమా పూర్తి చేసేసరికి నాని కోసం పలు ప్రాజెక్టులు సిద్ధంగా వుంటాయి.

మరి వాటిలో ముందుగా శ్యామ్ సింగ రాయ్‌ని మొదలు పెడతాడో లేక మరో చిత్రమేదైనా మొదలు పెడతాడో ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదు. 

పవన్ కళ్యాణ్ వచ్చినా, ఏ కళ్యాణ్ వచ్చినా భయపడేది లేదు