cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్ దాచుకున్న టైటిల్

త్రివిక్రమ్ దాచుకున్న టైటిల్

ఎన్నాళ్ల నుంచో దర్శకుడు త్రివిక్రమ్ దాచుకున్న టైటిల్ ఒకటి వుంది. ఎప్పటికప్పడు రెన్యూవల్ చేయించుకుంటూ వస్తున్నారు. చాలా మంది అడిగినా ఇవ్వడం లేదు. ఈ టైటిల్ రిజిస్టర్ చేయించింది ఇవ్వాళా నిన్నా కాదు. చాలా ఏళ్ల కిందట. ఆ టైటిల్ నే పార్ధు.

అతడు సినిమాలో మహేష్ పాత్ర పేరు పార్ధునే. అందుకే త్రివిక్రమ్ కు అంత ఆసక్తి అని అనుకుంటే పొరపాటు. త్రివిక్రమ్ కు ఇష్టమైన రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి. ఆమె నవలల్లో ఒకటి పార్ధు. అప్పటి నుంచే ఆ పేరు ఆయనకు ఇష్టం. ఆ పేరునే అతడు సినిమాలో మహేష్ కు వాడారు. అప్పటి నుంచి ఆ టైటిల్ రిజిస్టర్ చేసి, ఎప్పటికైనా సినిమా తీయాలని అలా వుంచారు.

ఆ మధ్య ఆసియన్ సునీల్ తాను నాగశౌర్యతో తీసే లక్ష్య సినిమా కోసం ఇదే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఇవ్వడానికి త్రివిక్రమ్ ఓకె అనలేదు. అంతకు ముందు కూడా వేరేవాళ్లు అడిగినా ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేయించుకుంటూ వస్తున్నారు. 

ఇప్పుడు ఈ టైటిల్ మహేష్ తో చేయబోతున్న సినిమాకు వాడుతున్నారని టాక్ మొదలైంది

స్టార్ హీరోలతో చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు

అందుకే కాంగ్రెస్ సీనియర్లు జగన్ వెంట రాలేదు

 


×