సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియా తిరిగి వస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తరువాత వెకేషన్ కు విదేశాలకు వెళ్లారు మహేష్ బాబు.
అక్కడ డీ టాక్సినేషన్ చేయించుకుని, ఫ్యామిలీతో వెకేషన్ గడిపి, మరో రెండు రోజుల్లో ఇండియాకు వస్తున్నారు. తరువాత చేయబోయే త్రివిక్రమ్ సినిమా వర్క్ ను ప్రారంభిస్తారు.
వెనక్కు వచ్చిన తరువాత ముందుగా చేయాల్సింది త్రివిక్రమ్ ఫైనల్ నేరేషన్ విని ఓకె చేయడం. వన్స్ అది ఓకె అయితే డైలాగ్ వెర్షన్ మొదలు పెడతారు త్రివిక్రమ్.
ఈ లోగా షెడ్యూళ్లు, ప్లానింగ్ వగైరా వ్యవహారాలు ఫినిష్ చేస్తారు. గతంలో ఓసారి నెరేషన్ ఇచ్చారు. కొన్ని కరెక్షన్స్ జరగడంతో మళ్లీ ఫైనల్ నెరేషన్ ఇవ్వబోతున్నారు.
ఈ సినిమా సెట్ మీదకు వెళ్లాలి. వీలయినంత త్వరగా అది పూర్తి చేయాలి. ఆ వెంటనే రాజమౌళి సినిమాను మహేష్ ప్రారంభించాల్సి వుంటుంది.
అప్పటి వరకు రాజమౌళి వెయిటింగ్ లో వుండాల్సిందే. ఫిబ్రవరి నాటికి మహేష్-త్రివిక్రమ్ సినిమా దాదాపు పూర్తవుతుందని అంచనా.