ట్రూ లవర్.. ఫిబ్రవరి 10 న

ప్రస్తుతం చిన్న సినిమా అంటే కల్ట్ సినిమా కావాలి లేదా డిఫరెంట్ సబ్జెక్ట్ తో రావాలి. లేదంటే జనం థియేటర్ కు రావడం లేదు. కొత్త వాళ్లు.. తెలియని మొహాలు అన్నది లేదు. కంటెంట్…

ప్రస్తుతం చిన్న సినిమా అంటే కల్ట్ సినిమా కావాలి లేదా డిఫరెంట్ సబ్జెక్ట్ తో రావాలి. లేదంటే జనం థియేటర్ కు రావడం లేదు. కొత్త వాళ్లు.. తెలియని మొహాలు అన్నది లేదు. కంటెంట్ కల్ట్ అయితే చాలు కుర్రకారు క్యూ కట్టేస్తున్నారు. అలాంటి కలర్ తో వస్తోంది ట్రూలవర్ ఫిబ్రవరి 10న.

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు.

ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.

రీసెంట్ గా “ట్రూ లవర్” సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో పాజిటివ్ టాక్ వస్తోంది. స్పెషల్ షో ద్వారా ఈ సినిమా చూసిన వారంతా రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి మంచి లవ్ స్టోరీ రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్ లోనూ “ట్రూ లవర్” సినిమా చూడాలనే బజ్ క్రియేట్ అవుతోంది.