టీవీ9 దేవి గురించి ఎవ‌రికీ తెలియ‌ని సంగ‌తి…

దేవి నాగ‌వ‌ల్లి…ప్ర‌ముఖ చాన‌ల్ టీవీ9 న్యూస్ యాంక‌ర్‌గా, రిపోర్ట‌ర్‌గా సుప‌రిచితురాలు. బ‌హుశా ఆమెకు ఈ గుర్తింపు, గౌర‌వ‌మే పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజ‌న్‌-4లో అవ‌కాశం ద‌క్కేందుకు కార‌ణ‌మైంది.  విచిత్ర వ‌స్త్ర‌ధార‌ణ‌, హెయిల్ స్టైల్‌తో…

దేవి నాగ‌వ‌ల్లి…ప్ర‌ముఖ చాన‌ల్ టీవీ9 న్యూస్ యాంక‌ర్‌గా, రిపోర్ట‌ర్‌గా సుప‌రిచితురాలు. బ‌హుశా ఆమెకు ఈ గుర్తింపు, గౌర‌వ‌మే పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజ‌న్‌-4లో అవ‌కాశం ద‌క్కేందుకు కార‌ణ‌మైంది.  విచిత్ర వ‌స్త్ర‌ధార‌ణ‌, హెయిల్ స్టైల్‌తో క‌నిపించే రాజ‌మండ్రికి చెందిన దేవి నాగ‌వ‌ల్లికి జ‌ర్న‌లిజం అంటే ఇష్టం. అందుకే ఆ మ‌క్కు వ‌తోనే ఆమె  మాస్ కమ్యునికేషన్‌లో డిప్లమో చేసి… ఎల‌క్ట్రానిక్ జ‌ర్న‌లిజంలో ట్రెండ్ సెట‌ర్‌గా నిలిచిన టీవీ 9తో కెరీర్ మొదలు పెట్టి…. అతి తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ ప్రజెంటర్‌గా పాపులర్ అయ్యారు.

బిగ్‌బాస్ రియాల్టీ షో ఆదివారం సాయంత్రం ఆరు గంట‌ల‌కు స్టార్ట్ అయింది. ఈ సంద‌ర్భంగా ఏడో కంటెస్టెంట్‌గా టీవీ9 యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి ఎంట‌ర్ అయ్యారు. బుల్లెట్ లాంటి ప్ర‌శ్న‌ల‌తో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఇంట‌ర్వ్యూ చేసే దేవి…హోస్ట్ నాగార్జున నిలిచిన బిగ్‌బాస్ వేదిక‌పైకి వస్తుంటే భ‌య‌మేసింద‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

దేవి నాగ‌వ‌ల్లి త‌న ప‌రిచ‌యంలో భాగంగా ఎవ‌రికీ తెలియ‌ని త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా చెప్పుకొచ్చారు. తాను ఏడెనిమిది నెల‌ల పాటు అమెరికాలో ఉన్నాన‌ని, అక్క‌డ ఉండ‌లేక తిరిగి వ‌చ్చిన‌ట్టు చెప్పారు. అలాగే చిన్న‌పిల్ల‌లా క‌నిపించే దేవి, త‌న‌కు పెళ్లి అయింద‌ని, భ‌ర్త‌తో విడిపోయిన‌ట్టు చెప్పారు. త‌న‌కు ఆరేళ్ల బాబు ఉన్నాడ‌న్నారు.

అలాగే గ‌త మూడు బిగ్‌బాస్ సీజ‌న్ల‌లో మ‌హ‌ళ‌లెవ‌రూ విజేత‌లు కాలేక‌పోయార‌ని, ఈ ద‌ఫా ఆ లోటును తాను భ‌ర్తీ చేస్తాన‌ని దేవి చెప్ప‌డం విశేషం. బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొనేందుకు రావ‌డం వెనుక ఉద్దేశం ఏంట‌ని హోస్ట్ నాగార్జున నేరుగా దేవిని ప్ర‌శ్నిం చారు. త‌న‌కు కొన్ని అవ‌స‌రాలున్నాయ‌ని, విజేత‌గా నిలిస్తే వ‌చ్చే డ‌బ్బు కోస‌మే వ‌చ్చిన‌ట్టు ఎలాంటి మొహ‌మాటం లేకుండా దేవి చెప్పుకొచ్చారు. 

కొంచెం కొత్తగా.. కొత్త పలుకు