ఆ దర్శకుడికి కలిసిరాని అదృష్టం

కొంతమందికి అంతే. అన్నీ చేతిదాకా వచ్చి అలా చేజారిపోతుంటాయి. దర్శకుడు నీలకంఠ పరిస్థితి కూడా ఇదే. మొన్నటికిమొన్న ఓ సినిమా సగం చేసి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకో సినిమా సెట్స్ పైకి వచ్చే…

కొంతమందికి అంతే. అన్నీ చేతిదాకా వచ్చి అలా చేజారిపోతుంటాయి. దర్శకుడు నీలకంఠ పరిస్థితి కూడా ఇదే. మొన్నటికిమొన్న ఓ సినిమా సగం చేసి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకో సినిమా సెట్స్ పైకి వచ్చే టైమ్ కు చేజారిపోయింది.

ముందుగా తాజాగా చేజారిన సినిమా సంగతి చూద్దాం. లాక్ డౌన్ కు ముందు రాజశేఖర్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాడు నీలకంఠ. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తిచేశాడు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో కరోనా రావడం, అదే టైమ్ లో రాజశేఖర్ కరోనా బారిన పడడం చకచకా జరిగిపోయాయి.

ఈ గ్యాప్ లోనే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా వచ్చాయి. మలయాళ రీమేక్ కు నీలకంఠ చేసిన మార్పుచేర్పులు రాజశేఖర్ కు నచ్చలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టు నుంచి నీలకంఠ తప్పుకోవాల్సి వచ్చింది. అదే ప్రాజెక్టును తాజాగా 'శేఖర్' పేరిట లలిత్ దర్శకత్వంలో ఎనౌన్స్ చేశారు.

ఇక నీలకంఠ చేజారిన మరో ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసిందే. అదే క్వీన్ రీమేక్. తమన్న లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. అతడి డైరక్షన్ లో దాదాపు 60శాతం షూటింగ్ కూడా పూర్తయింది. అంతలోనే దర్శకుడికి, తమన్నకు ఏదో గొడవ జరిగిందంటూ పుకార్లు రావడం, ఆ వెంటనే నీలకంఠ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగడం చకచకా జరిగిపోయాయి.

ఇలా 2 ఏళ్ల గ్యాప్ లో 2 ప్రాజెక్టులు నీలకంఠ చేజారిపోయాయి. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత, నెక్ట్స్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్