పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడనేది పక్కా. ఎప్పట్నుంచి సెట్స్ పైకి వెళ్తుంది, షెడ్యూల్స్ ఎలా అనేది కరోనా క్రైసిస్ తగ్గిన తర్వాత ప్లాన్ చేస్తారు. మరోవైపు నిర్మాతలు, సహ-నిర్మాతలు, అసలు నిర్మాతలు (14 రీల్స్ ప్లస్), పెట్టుబడిదారులకు మధ్య వాటాల పంపిణీ కూడా పూర్తయింది. దీంతో ఇప్పుడు నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టాడు దర్శకుడు. ఇందులో భాగంగా మహేష్ బాబు సినిమాలో ఉపేంద్రను విలన్ గా తీసుకునే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ఫ్యామిలీ-యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉన్న రాబోతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఉపేంద్ర అయితే బాగుంటుందనే డిస్కషన్ యూనిట్ లో నడుస్తోంది. సోనూ సూద్ పేరు కూడా లిస్ట్ లో ఉన్నప్పటికీ ఎక్కువమంది మాత్రం ఉపేంద్రకే ఓటేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మహేష్ బాబు దగ్గరకు కూడా మేటర్ వెళ్లింది. ఇప్పటికే టోటల్ స్క్రీన్ ప్లే చదివిన మహేష్ బాబు.. ఉపేంద్ర సెలక్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రతినాయకుడి పాత్రలు ఉపేంద్రకు కొత్త కాదు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇతడు పోషించిన పాత్ర నెగెటివ్ షేడ్స్ లోనే ఉంటుంది. కాకపోతే అది పూర్తిస్థాయి విలన్ పాత్ర కాదు. ఈసారి మహేష్ మూవీలో మాత్రం ఉపేంద్రకు ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ దక్కినట్టు చెబుతున్నారు.
సినిమాకు సంబంధించి విలన్ పాత్రతో పాటు హీరోయిన్ ఎంపిక కూడా పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ టైమ్ లో నటీనటుల ఎంపికపైనే దృష్టిపెట్టాడు పరశురామ్. అంతేకాదు, ఈ లాక్ డౌన్ టైమ్ లోనే మహేష్-పరశురామ్ సినిమాను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట.