నీ క‌న్ను నీలి స‌ముద్రం పాట‌కు ఉప్పెనలా వ్యూస్‌

సోష‌ల్ మీడియా రాజ్య‌మేలుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తిదానికి వ్యూస్ కొల‌బ‌ద్ద అయింది. దేనికైనా వ్యూస్ బాగా వ‌స్తున్నా యంటే…అది హిట్ సాధించిన‌ట్టు లెక్క‌. తాజాగా ఓ సినిమాలోని పాట‌కు  ‘ఉప్పెన’లా వ్యూస్ వ‌స్తున్నాయి. యూట్యూబ్‌ను…

సోష‌ల్ మీడియా రాజ్య‌మేలుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తిదానికి వ్యూస్ కొల‌బ‌ద్ద అయింది. దేనికైనా వ్యూస్ బాగా వ‌స్తున్నా యంటే…అది హిట్ సాధించిన‌ట్టు లెక్క‌. తాజాగా ఓ సినిమాలోని పాట‌కు  ‘ఉప్పెన’లా వ్యూస్ వ‌స్తున్నాయి. యూట్యూబ్‌ను ఆ సాంగ్ షేక్ చేస్తోంది. స‌హ‌జంగానే సినిమాకు వ్యూయ‌ర్స్ ఎక్కువ‌. ఇక పాట‌లోని సాహిత్యం, సంగీతానికి క‌నెక్ట్ అయితే వ్యూస్‌కు ఆకాశ‌మే హ‌ద్దు అని చెప్పొచ్చు.

తాజాగా  ‘ఉప్పెన’ చిత్రంలోని ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ పాట ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌నంత‌గా యూట్యూబ్‌లో దూసుకు పోతోంది. ఈ రొమాంటిక్ సాంగ్ 100 మిలియ‌న్ వ్యూస్ సాధించింది. అంటే ప‌ది కోట్ల మంది ఈ పాట చూశార‌న్న మాట‌. ఇదేమీ ఆశామాషీ విష‌యం కాదు. ఈ పాట‌కు బాణీలు క‌ట్టిన‌ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఆదివారం బ‌ర్త్‌డే కావ‌డం విశేషం.

దేవిశ్రీ క‌ళా హృద‌యంతో క‌ట్టిన  బాణీలకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ పాట వింటుంటే అలా అలా ఆకాశంలో విహ‌రిస్తున్న‌ట్టు ఫీలింగ్‌. సోష‌ల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్‌లో ఉండ‌డంతో ‘ఉప్పెన’పై స‌హ‌జంగానే అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ పాట మొద‌ట్లో ఒక నిమిషం, చివ‌ర్లో అర నిమిషం పాటు ఖ‌వ్వాలీ సాంగ్‌కు జావెద్ అలీ గానం తోడైంది. దీంతో హిందీ భాష రాని వాళ్ల‌ను సైతం ఆ గానం, భావం పాట‌లో లీనం చేసుకొంది.

ఈ పాట రిథ‌మ్‌కు త‌గ్గ‌ట్టు హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతీ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్‌, వాళ్ల అభిన‌యం ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేస్తుంది. ఈ పాట‌కు శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ చ‌క్క‌ని, చిక్క‌టి సాహిత్యం అందించారు. సాహిత్యంతో పాటు మ‌న‌సు ప‌రుగు పెట్టేలా స్లో మోష‌న్‌లో పాడిన విధానం సంగీత ప్రియుల్ని క‌ట్టిప‌డేస్తోంది. ఈ పాట‌తో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాకు మ్యూజిక్‌పై ఉన్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధాస‌క్తులు ప్ర‌తిబింబిస్తున్నాయి.

చంద్రబాబు స్వయంకృతాపరాధం