బాలీవుడ్, ఇతర సినిమా పరిశ్రమలకు చెందిన ప్రముఖులపై నోటికి వచ్చిన ట్వీట్లు చేసే ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధుపై బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా పరువు నష్టం కేసు వేశారు. దీనికి ప్రధాన కారణం యూరప్ లో ఏజెంట్ సినిమా ఘాటింగ్ సందర్భంగా ఊర్వశిని టాలీవుడ్ హీరో అఖిల్ వేధించాడంటూ, అతనితో పనిచేయటం కంపర్ట్ గా లేదని ఆమె ఫీలవుతున్నట్లుగా ట్వీట్ చేయడమే.
ఉమైర్ ట్వీట్ కు ఊర్వశీ రౌతేలా స్పంధిస్తూ.. ఉమైర్ సంధు మెచ్యూరిటీ లేని జర్నలిస్ట్ అని.. అతని వల్ల తాను, తన కుటుంబం చాలా ఇబ్బంది పడిందని.. అతను చెప్పినవి అన్ని అసత్య ఆరోపణలే అంటూ ఫైర్ అయ్యారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయనపై పరువునష్టం కేసు కింద నోటీసులు పంపించినట్లు తెలిపింది.
వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో హుషారుగా స్టెప్పులు వేసిన ఊర్వశీ రౌతేలాకు తెలుగులో మంచి పేరు వచ్చింది. వేర్ ఈజ్ ద పార్టీ..పాట హిట్ కావడంతో ఊర్వశికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ చిత్రంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ప్రత్యేక పాట తెరకెక్కించారు. ఇందులో అఖిల్ తో కలిసి ఊర్వశి కాలు కదిపింది.
కాగా దుబాయిలో వుంటూ ప్రతి భారీ సినిమాకు ముందుగా చూసి చెబుతున్నా అంటూ ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చే ఉమైర్ సంధు. సినిమా అప్ డేట్ లు కాస్త అటు ఇటుగా ఇవ్వడం వరకు ఫరవాలేదు కానీ ఈ మధ్య కాలంలో మరీ పర్సనల్ డ్యామేజ్ ట్వీట్ లు చేస్తున్నారు.