Advertisement

Advertisement


Home > Movies - Movie News

భగత్ సింగ్ 'గాజు గ్లాసు' రాజకీయం

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఉరుములేని మెరుపులా అప్ డేట్ వస్తుందంటూ ప్రకటన రాగానే, అది పవన్ రాజకీయాల కోసం ఉద్దేశించి అయి ఉంటుందని చాలామంది ఊహించారు. ఊహించనిది వస్తోందంటూ మేకర్స్ చెప్పినా, చాలామంది ఊహించినట్టుగానే వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో.

భగత్ బ్లేజ్ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో పవన్ కల్యాణ్ హీరోయిజంతో పాటు, అతడి పార్టీ గుర్తు గాజు గ్లాసుకు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే సందర్భం కాకపోయినా, ఎన్నికల వేళ ఈ వీడియోను విడుదల చేశారు.

భగత్ బ్లేజ్ లో గాజు గ్లాస్ గొప్పదనాన్ని పవన్ నోట చెప్పించాడు దర్శకుడు హరీశ్ శంకర్. గాజు పగిలేకొద్దీ పదునెక్కుంది అనే డైలాగ్ నుంచి 'గుర్తుపెట్టుకో, గ్లాసు అంటే సైజు కాదు, సైన్యం' అంటూ చెప్పించాడు.

వీడియోలో పవన్ హీరోయిజంతో పాటు, ఈ 2 డైలాగ్స్ కు చోటు కల్పించారు. అంతకుమించి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది.. రిలీజ్ ఎప్పుడు లాంటి వివరాలేవీ వీడియోలో లేవు.

కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, హరీశ్ శంకర్ కలిసి ఉడతాభక్తిగా పవన్ కు ఈ వీడియో సాయం అందించినట్టున్నారు.

మరోవైపు ఈ వీడియోపై నటి పూనమ్ కౌర్ స్పందించింది. వీడియో మొత్తం కనిపించిన పవన్ కల్యాణ్ ను వదిలేసి, దేవిశ్రీ ప్రసాద్ ను మెచ్చుకుంది. తన మ్యూజిక్ లేకుండా ఓ కమర్షియల్ సినిమా సంపూర్ణం కాదని ట్వీట్ చేసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?