యువి థియేటర్ మూత

ఆంధ్రలో థియేటర్ల కల్లోలం కొనసాగుతోంది. అప్రకటిత సమ్మె అన్నట్లుగా థియేటర్ల మూత జ‌రుగుతోంది. కొన్ని థియేటర్లు మరమ్మతు అని, మరి కొన్ని థియేటర్లు టికెట్ ల ధరలు సరిపోవని, ఇంకొన్ని ఇంకో కారణంతో మొత్తానికి…

ఆంధ్రలో థియేటర్ల కల్లోలం కొనసాగుతోంది. అప్రకటిత సమ్మె అన్నట్లుగా థియేటర్ల మూత జ‌రుగుతోంది. కొన్ని థియేటర్లు మరమ్మతు అని, మరి కొన్ని థియేటర్లు టికెట్ ల ధరలు సరిపోవని, ఇంకొన్ని ఇంకో కారణంతో మొత్తానికి మూసి వేస్తున్నారు. 

చాలా థియేటర్లు గత చాలా ఏళ్లుగా బి ఫారం లు లేకుండానే రన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఫీజు ఎగ్గొడుతూ వస్తున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ల సమస్య రాగానే ఆ అసలు విషయం బయటకు వచ్చింది.

చాలా థియేటర్లతో పాటు యువి సంస్థ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిర్మించిన విఎపిక్ థియేటర్ కాంప్లెక్స్ లోని బిగ్ స్క్రీన్ కూడా మూతపడింది. దక్షిణ భారతంలోనే ఇది అతి పెద్ద స్క్రీన్. అయితే ఈ కాంప్లెక్స్ రూరల్ ఏరియాలో వున్నందున టికెట్ రేట్లు తక్కువ. దాంతో మూసి వేయక తప్పలేదు.

ప్రస్తుతానికి కొత్త సినిమాల విడుదలలు ఏమీ లేవు ఈ నెలాఖరున శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ మాత్రమే వుంది. మళ్లీ 7 నుంచి ఆర్ఆర్ఆర్ ఆపైన రాధేశ్యామ్, బంగార్రాజు సినిమాలు రావాల్సి వుంది. అప్పటికి పరిస్థితులు ఎలా వుంటాయో చూడాలి.