వైష్ణవ్ తేజ్ హీరోగా సితార సంస్థ కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తయారువుతున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా దాదాపు పూర్తయింది. మరొక్క షెడ్యూలు చేస్తే చాలు పూర్తయిపోతుంది.
శ్రీలీల డేట్ లు అడ్జస్ట్ చేస్తే సినిమా పూర్తయిపోతుంది. ఇదిలా వుంటే ఈ సినిమా టైటిల్ మరో రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేసే ఆలోచనలు సాగుతున్నాయి.
ఈ సినిమా పక్కాగా రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాగా తయారవుతోంది. గతంలో వచ్చిన ఆది లాంటి సినిమా అని టాక్ వుండనే వుంది. అందుకే ఈ సినిమాకు ‘ఆది కేశవ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇది కాక ఆల్టర్ నేటివ్ టైటిల్ గా ‘ముక్కంటి’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఒకటి ఫైనల్ చేసి కొద్ది రోజుల్లో అనౌన్స్ చేసే పనిలో వున్నారు మేకర్లు.
ఉప్పెన తరువాత సరైన సినిమా పడలేదు వైష్ణవ్ తేజ్ కు. ఉప్పెన ఇచ్చిన ఊపును నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు పక్కా ఫుల్ మాస్ సినిమా చేస్తున్నాడు. అది కూడా ఆది లాంటి సీమ ఫ్యాక్షన్ సినిమా. మరి ఈ సినిమా హిట్ కొడితే ఓకె. లేదంటే హీరోగా కెరీర్ ట్రబుల్ లో పడుతుంది.