పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిలిమ్ వకీల్ సాబ్.ఈ సినిమాకు బజ్ తేవాలని, ఓపెనింగ్స్ కుమ్మేలా చేయాలని నిర్మాత దిల్ రాజు కిందా మీదా అవుతున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ చేయాలని తలపెట్టారు. ఈ ఫంక్షన్ కే కోటికి పైగా ఖర్చుచేయబోతున్నారని బోగట్టా. ఆఫ్ కోర్స్ అదంతా స్పాన్సర్లు చూసుకుంటారు.
ఇదిలా వుంటే ఈ ఫంక్షన్ కు రామ్ చరణ్ హాజరవుతాడని తెలుస్తోంది. అన్న చిరంజీవి ని కూడా ఆహ్వానించమని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ ఎలాగూ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ ను నేరుగా దిల్ రాజు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మెగాస్టర్, పవర్ స్టార్, రామ్ చరణ్ ముగ్గురూ ఓ వేదిక మీద వుంటే మెగా ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.