Advertisement

Advertisement


Home > Movies - Movie News

వకీల్ సాబ్: మార్పులు బాగానే కనిపిస్తున్నాయి

వకీల్ సాబ్: మార్పులు బాగానే కనిపిస్తున్నాయి

పింక్ సినిమాకు తెలుగు రీమేక్ గా వస్తోంది వకీల్ సాబ్ మూవీ. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో హిందీ, తమిళ వెర్షన్లు చూసిన వాళ్లకు ఓ అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే తెలుగులో ఆ పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్నాడనగానే చాలామంది పెదవి విరిచారు.

అయితే సినిమా లాంఛింగ్ టైమ్ లోనే ఈ విషయంపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ.. సినిమా మరో రేంజ్ లో ఉంటుందని, కథనం పూర్తిగా కొత్తగా ఉంటుందని, మరో పింక్ చూస్తారంటూ అప్పుడే హింట్ ఇచ్చాడు. తాజాగా రిలీజైన టీజర్ నుంచే ఆ కొత్తదనం చూపించడం స్టార్ట్ చేశారు మేకర్స్.

కథతో సంబంధం లేకుండా పవన్ ఎలివేషన్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఎపిసోడ్స్ రాసుకున్నారనే విషయం టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అంతేకాకుండా, పవన్ స్టయిల్-మేనరిజమ్స్ కు కూడా పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. ఇవేవీ ఒరిజినల్ మూవీలో కనిపించవు.

టీజర్ చూస్తుంటే... వకీల్ సాబ్ లో యాక్షన్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎలాంటి మార్పులు చేశారు, పవన్ పాత్ర ఏంటనే విషయాన్ని గ్రేట్ ఆంధ్రలో ఇదివరకే చర్చించాం.

మొత్తమ్మీద పవన్ కల్యాణ్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజరైతే వచ్చేసింది. ఎప్పట్లానే తమన్ మరోసారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. చిన్న నిరాశ ఏంటంటే.. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని చాలామంది ఎదురుచూశారు. అదింకా పెండింగ్ లోనే ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?