‘వర్మ మన ఖర్మ’ టైటిల్‌తో ఓ పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకాన్ని యువ రచయిత్రి రేఖ పర్వతాల రచించారు. ఈ పుస్తకాన్ని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మే ఆవిష్కరించడం విశేషం.
ఈ ఆవిష్కరణ సభకు ఒక ప్రత్యేకత ఉంది. సహజంగా వర్మకు కుటుంబ బాంధవ్యాలు లాంటి సెంటిమెంట్స్ ఏవీ ఉండవు. ఈ విషయాన్నే తనే అనేక సందర్భాల్లో చెప్పారు.
తాజాగా తనపై రాసిన పుస్తకాన్ని తల్లి సూర్యవతి, సోదరి విజయ, ప్రముఖ యాంకర్ స్వప్నతో పాటు రచయిత్రితో కలిసి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పుస్తకం టైటిల్ చదివినప్పుడు నెగెటివ్ కోణంలో రాశారని అనుకున్నట్టు తెలిపారు.
తనకు, ఇతరులకు తేడా ఏంటో చెప్పుకొచ్చాడు. ప్రతి మనిషిలో మృగం ఉంటాడన్నారు. కానీ ఆ వ్యక్తి గిల్టీగా ఫిల్ అవుతాడన్నారు. తనలోని చెడును దాచుకుని మంచిగా ఉండాలనుకునే క్రమంలో వారి జీవితం ముగుస్తుందన్నారు. కానీ తన విషయం అందుకు విరుద్ధమన్నారు.
తాను అనుకున్నదే చేస్తానని, జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నడూ తన ఖర్మ అనుకోలేదని సెలవిచ్చారు. తాను చాలా పుస్తకాలు చదివినట్టు చెప్పుకొచ్చారు. ఆ
లోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, ఆవేదన చెందితే డిప్రెషన్ పెరుగుతుందన్నారు. రచయిత్రి రేఖ తన కోసం ఒక్క సంవత్సరం జీవితం వ్యర్థం చేసుకుందని, ఇక నుంచి భావి జీవితం గురించి ఆమె ఆలోచించాలని సరదాగా చురకలంటించారు.