Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ ఏడాదికి తొలి సినిమా రెడీ చేసిన మెగాహీరో

ఈ ఏడాదికి తొలి సినిమా రెడీ చేసిన మెగాహీరో

మొన్నటివరకు నిశ్చితార్థం, పెళ్లి పుకార్లతో వార్తల్లో నిలిచాడు వరుణ్ తేజ్. ఇప్పుడు తన సినిమాలతో మరోసారి హైలెట్ అయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గాంఢీవధారి అర్జున సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది వరుణ్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది గాంఢీవధారి అర్జున. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోంది ఈ మూవీ. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమా అంటున్నారు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు.

గతేడాది గని, ఎఫ్3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్ తేజ్. వీటిలో గని సినిమా డిజాస్టర్ అవ్వగా, ఎఫ్3 సినిమా హిట్టయింది. సోలోగా హిట్ కొట్టలేకపోయాననే బాధ మాత్రం వరుణ్ కు మిగిలిపోయింది. దీంతో ఆ లోటును గాంఢీవధారి అర్జున సినిమాతో భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు ఈ మెగా హీరో.

ప్రస్తుతం చిత్ర యూనిట్ విదేశాల్లో శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉంది. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు మేక‌ర్స్. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?