Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌న్న మెగా హీరో

బాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌న్న మెగా హీరో

త‌న‌కు బాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్టుగా చెప్పాడు వ‌రుణ్ తేజ్. తెలుగులో వ‌ర‌స విజ‌యాలతో ఊపు మీదున్న ఈ హీరో త‌న బాలీవుడ్ డ్రీమ్స్ ను పంచుకున్నాడు. త‌న‌కు హిందీలో అవ‌కాశాలు కూడా వ‌స్తున్న‌ట్టుగా, అయితే డేట్స్- ఇత‌ర వ్య‌వ‌హారాలు కుద‌ర‌క హిందీ సినిమాల‌కు ఓకే చెప్ప‌లేక‌పోతున్న‌ట్టుగా వ‌రుణ్ తేజ్ వివ‌రించాడు. అయితే హిందీ సినిమాల్లో న‌టించాల‌నే ఇంట్రెస్ట్ మాత్రం త‌న‌లో ఉంద‌ని వ‌రుణ్ స్ప‌ష్టంగా చెప్పాడు. అన్నీ కుదిరితే హిందీలో సినిమా చేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించాడు.

ఇది వ‌ర‌కూ ప‌లువురు తెలుగు హీరోలు డైరెక్టు హిందీ సినిమాల ప్ర‌య‌త్నాలు చేశారు. అలా ఎవ‌రూ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయారు. కొద్దో గొప్పో నాగార్జున మాత్ర‌మే బెట‌ర్. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాలు బాహుబ‌లి, త‌ర్వాతి సినిమాలు తెలుగుతో పాటు హిందీలో కూడా విడుద‌ల అవుతున్నాయి. మిగ‌తా వాళ్ల సినిమాలు డ‌బ్బింగ్ అవుతున్నా.. అవ‌న్నీ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యే బాప‌తు కాదు. టీవీల కోసం, యూట్యూబ్ కోస‌మే.

డైరెక్టుగా తెలుగుతో పాటు హిందీలో సినిమాలు చేసే స‌త్తా మాత్రం తెలుగు హీరోల‌కు ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతున్న‌ట్టుగా ఉంది. ఒక‌రిద్ద‌రు డైరెక్టు హిందీ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తితోనే క‌నిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారిలో త‌ను కూడా ఒకడినంటూ వ‌రుణ్ తేజ్ ప్ర‌క‌టించుకున్నాడు. అన్నీ కుదిరితే బాలీవుడ్ ఎంట్రీ అంటున్నాడు. అక్క‌డ త‌న‌కు షారూక్ ఖాన్ అంటే చాలా ఇష్ట‌మ‌ని వ‌రుణ్ చెప్పాడు. ఒక‌సారి త‌న అన్న రామ్ చ‌ర‌ణ్ ఇంటికి షారూక్ వ‌చ్చాడ‌ని, అప్పుడు ఆయ‌న‌ను అలా చూస్తూ ఉండిపోయిన‌ట్టుగా వ‌రుణ్ చెప్పాడు. ఆయ‌న‌తో క‌లిసి కాఫీ తాగుతూ ముచ్చ‌టించడం డ్రీమ్ అని వ‌రుణ్ చెప్పుకున్నాడు.

బాలయ్య గుండు సీక్రెట్ అదేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?