వీరమల్లు 150 కోట్లు.. ఆర్ఆర్ఆర్ 200 కోట్లు

కరోనాతో నష్టాలు చవిచూసిన ఛానెళ్లన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లకు మెల్లమెల్లగా రెవెన్యూ రావడం మొదలైంది. ఇలాంటి టైమ్ లో రెండు సినిమాలు ఛానెళ్లను ఇబ్బంది పెడుతున్నాయి. అవే…

కరోనాతో నష్టాలు చవిచూసిన ఛానెళ్లన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లకు మెల్లమెల్లగా రెవెన్యూ రావడం మొదలైంది. ఇలాంటి టైమ్ లో రెండు సినిమాలు ఛానెళ్లను ఇబ్బంది పెడుతున్నాయి. అవే హరిహర వీరమల్లు, ఆర్ఆర్ఆర్ సినిమాలు.

పవన్ హీరోగా నటిస్తున్న వీరమల్లు, చరణ్-ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలు ఛానెళ్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రెండు సినిమా యూనిట్లు చెబుతున్న రేట్లు చూసి సదరు ఛానెళ్లు బిత్తరపోతున్నాయి.

ముందుగా ఆర్ఆర్ఆర్ విషయానికొద్దాం.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాన్-థియేట్రికల్ బిజినెస్ ప్రారంభమై చాన్నాళ్లయింది. కానీ ఇప్పటివరకు ఏ డీల్ లాక్ అవ్వలేదు. దీనికి కారణం నిర్మాత చెబుతున్న రేటు. 

నాన్-థియేట్రికల్ రైట్స్ కింద 200 కోట్ల రూపాయలు ఆశిస్తున్నాడు దానయ్య. ఇప్పటికే స్టార్ మా, జెమినీ, జీ తెలుగు సంస్థల్ని ఓ రౌండ్ చుట్టేసిన ఈ నిర్మాత.. డీల్ సెట్ కాకపోవడంతో రేటును సవరించే పనిలో పడ్డాడు.

అటు వీరమల్లు సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది. 150 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నిర్మాత ఏఎం రత్నం.. నాన్-థియేట్రికల్ రైట్స్ కింద 150 కోట్ల రూపాయల్ని (ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం) కోట్ చేస్తున్నాడు. దీంతో ఛానెళ్లన్నీ బిక్కమొహం వేశాయి.

ప్రస్తుతం ఈ రెండు సినిమా రేట్లు చూసి ఏ ఒక్క ఛానెల్ ముందుకురావడం లేదు. ఇప్పుడీ రెండింటికి తోడు ఆచార్య కూడా తోడైంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య శాటిలైట్ డీల్ ఇంకా పూర్తికాలేదు. వాళ్లు కూడా భారీ రేట్లు చెబుతున్నారు. 

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు