వీరసింహారెడ్డి ఓ విజువల్ ఫీస్ట్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ…

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రిషి పంజాబీ మీడియా సమావేశంలో 'వీరసింహారెడ్డి' విశేషాలని పంచుకున్నారు.

కెమరామెన్ గా సినిమాకి మొదటి ప్రేక్షకుడు మీరు.. 'వీరసింహారెడ్డి' ఎలా ఉండబోతుంది ?

వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో వుంటాయి. ప్రేక్షకులకు సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. సినిమా చూస్తున్నపుడు చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. 'వీరసింహారెడ్డి' బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్ టైనర్.

ఎన్ని లొకేషన్ లో షూట్ చేశారు.. షూటింగ్ పరంగా కష్టమైన లొకేషన్ ఏది ?

'వీరసింహారెడ్డి' కోసం ఏడాది పాటు షూట్ చేశాం. దాదాపు అన్ని బుతువుల్లో షూటింగ్ జరిగింది. సిరిసిల్లల్లో షూట్ చేస్తునపుడు తీవ్రమైన వేడి వుండేది. అలాగే టర్కీ , ఇస్తాంబుల్, అంటాల్య లో కూడా షూటింగ్ చేశాం. అక్కడ కూడా చాలా వేడి వుంటుంది. ఈ సినిమాలో రగ్గడ్ నెస్ కావాలి. దాని కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎచీవ్ చేశాం.

టెక్నికల్ గా ఈ సినిమా కోసం ఏమైనా ప్రయోగాలు చేశారా ?

లండన్ నుండి తీసుకొచ్చిన న్యూ సెటప్ లెన్స్ లు వాడాం. కలర్స్ అద్భుతంగా వుంటాయి. సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది.

కమర్షియల్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్స్ చేయడంలో ఎలాంటి సవాల్ వుంటుంది?

సవాల్ అంటూ ఏమీ వుండదు. గతంలో సరైనోడు, జయ జానకి నాయక లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ చేశాను. ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను.