Advertisement

Advertisement


Home > Movies - Movie News

వీరు పోట్ల చేతుల మీదుగా రాహు

వీరు పోట్ల చేతుల మీదుగా రాహు

ఎన్నారై యువకుడు సుబ్బు వేదుల దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం రాహు. ఇటీవలే సిద్దు శ్రీరామ్ పాడిన పాటను విడుదల చేసారు. ఆ పాట బాగా వైరల్ అవుతోంది. కాగా లేటెస్ట్ గా ఈ సినిమా ట్రయిలర్ ను  దర్శకుడు వీరు పోట్ల విడుదల చేసారు.

ట్రయిలర్ విడుదల సందర్భంగా  దర్శకుడు సుబ్బు వేదుల    మాట్లాడుతూ  మమ్మల్ని  సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి థాంక్స్ .  రాహు అంటే అందరూ జాతకాల స్లోరీ అనుకుంటున్నారు. కానీ మా స్టోరీ అది కాదు. హీరోయిన్ ను రాహువులా చుట్టుకునే రెండు సమస్యల పై ఆమె పోరాటమే సినిమా అన్నారు. చాలా హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించాలని ఆయన తెలిపారు. 

సంగీత దర్శకుడు  ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ : "ఏమో ఏమో పాటకు వస్తున్న రెస్పాన్స్ బాగుంది . సినిమా  సెకండ్ ఆఫ్ లో  బ్యాగ్రౌండ్ స్కోర్ కి చాలా స్కోప్ ఉంది. దర్శకుడు సుబ్బు  చాలా ఫ్రీడమ్ ఇచ్చారు . " అన్నారు.

నిర్మాత ల్లో ఒకరైన శ్రీ శక్తి బాబ్జి మాట్లాడుతూ : "దర్శకుడు చెప్పిన కథ కంటే సినిమా చాలా బాగా వచ్చింది.  రాహు సినిమా మాకు సంతృప్తి నిచ్చింది" అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?