వెంకీమామ…ఆచి తూచి, విడుదలైన సినిమా. ఫస్ట్ వీకెండ్ ఝమ్మని లేచి, మండే క్రాష్ అయింది. అయితే అదృష్టం ఏమిటంటే, ఎక్కడా డెఫిసిట్ లోకి రాలేదు. సురేష్ మూవీస్ స్వంత డిస్ట్రిబ్యూషన్ కావడంతో, థియేటర్ల ప్లానింగ్, ఎక్కడ ఎన్ని వుండాలి. ఎక్కడ తీసేయాలి వంటి కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టి, షేర్ చీలిపోకుండా చూసుకున్నారు. దాంతో ఎక్కడా డెఫిసిట్ రాలేదు. వీక్ లాంగ్ లక్షల్లో అయినా షేర్ కనిపిస్తూ వచ్చింది. అదే సమయంలో మళ్లీ సెకెండ్ వీకెండ్ వచ్చేసరికి బాగా ఫెర్ ఫార్మ్ చేసింది. చాలా చోట్ల, చాలా షో లు ఫుల్స్ రావడం విశేషం.
సినిమా విడుదలైన పదో రోజు కూడా ఏపి తెలంగాణల్లో కలిపి కోటి పన్నెండు లక్షలు వసూలు చేయడం విశేషం. తొమ్మిదవ రోజు అయిన శనివారణ 94 లక్షల షేర్ వచ్చింది రెండు రాష్ట్రాల్లో కలిపి. మొత్తం మీద వెంకీ మామ గట్టెక్కేసినట్లే.
ఎందుకంటే సినిమా నిర్మాణానికి 48 కోట్ల వరకు అయింది. నాన్ థియేటర్, తదితర వ్యవహారాల ద్వారా వచ్చింది తీసేసినా, ముఫై కోట్ల వరకు థియేటర్ రైట్స్ మీద వుంది. ఇప్పుడు ఆ మేరకు రికవరీ వచ్చింది. ఈవారం కాస్త షేర్ లాగేస్తే కమిషన్లు కిట్టుబాటు అవుతాయి సురేష్ సంస్థకు కూడా.
9 రోజుల కలెక్షన్స్
Nizam: 9.51Cr
Ceeded: 3.99Cr
UA: 3.60Cr
East: 1.93Cr
West: 1.20cr
Guntur: 1.93Cr
Krishna: 1.44Cr
Nellore: 85L
AP-TG Total:- 24.45CR
Ka & ROI: 2.44Cr