Advertisement

Advertisement


Home > Movies - Movie News

విజ‌య్ అదే ఫీట్ రిపీట్ చేస్తాడా?

విజ‌య్ అదే ఫీట్ రిపీట్ చేస్తాడా?

టాలీవుడ్ లో వున్న ఓ సెంటిమెంట్ ను 2021 లో తమిళ హీరో విజ‌య్ బ్రేక్ చేసాడు. సంక్రాంతికి విడుదలయ్యే డబ్బింగ్ సినిమాలు హిట్ కావు అన్నది సెంటిమెంట్. కానీ 2021లో విజ‌య్ మాస్టర్ సినిమా విడుదలైంది. మంచి రిజ‌ల్ట్ సాధించింది. ఇప్పుడు మళ్లీ 2023లో విజ‌య్ డబ్బింగ్ సినిమా వారసుడు సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరి సెంటి మెంట్ నిజ‌మవుతుందో. లేదా విజ‌య్ మరోసారి అదే సెంటిమెంట్ ను బ్రేక్ చేసి విజ‌యం సాధిస్తాడో చూడాలి.

సోషల్ మీడియాలో తిరుగుతున్న జాబితా ప్రకారం 1997 లో హిట్లర్ & పెద్దన్నయ్య తో 'ఇద్దరు', 'మెరుపు కలలు' పోటీ పడ్డాయి. 2015 లో 'ఐ' సినిమా గోపాలా గోపాలా తో పోటీ పడింది. 2018లో జై సింహా, అజ్ఞాతవాసీ తో 'గ్యాంగ్' సినిమా ఢీకొంది. 2019 ఎఫ్2 , వినయ విధేయ రామ, ఎన్ టి ఆర్ కథానాయకుడు సినిమాలతో 'పేట' పోటీ పడింది. 2020 లో సరిలెరునీకెవ్వరు, అలావైకుంఠపురములో సినిమాలతో 'దర్బార్' విడుదలైంది. ప్రతి డబ్బింగ్ సినిమా నెగిటివ్ రిజ‌ల్ట్ నే తెచ్చుకుంది.

కానీ 2021 లో క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ లతో పాటు 'మాస్టర్' కూడా విడుదలైంది. రెడ్, అల్లుడు అదుర్స్ సరైన ఫలితాల సాధించకపోవడంతో మాస్టర్ పాజిటివ్ ఫలితాన్నే నమోదు చేసింది. ఆ విధంగా విజ‌య్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసినట్లు అయింది. ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య లతో విజ‌య్ వారసుడు సినిమా పోటీ పడుతోంది.

మరి సెంటిమెంట్ మరోసారి విజ‌య్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?