ప్రేమ కథాచిత్రాల హీరోగా యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మాటలు భలే వెరైటీగా ఉంటాయి. అతను ఏం మాట్లాడినా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘ప్రేమే ప్రధానాంశంగా ఉన్న ‘అర్జున్‌రెడ్డి’ (2017), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటివి చేయకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కెరీర్‌లో ఓ మార్పు కోరుకుంటున్నాను’…ఇలా చెప్పడం ఒక్క విజయ్ దేవరకొండకు మాత్రమే సాధ్యం.
క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ అనేక విశేషాలను మీడియాతో పంచుకున్నారు. తాను ప్రేమ కథా చిత్రాలు చేయనంటే కేవలం వ్యాపార అంశాలతో కూడుకున్న సినిమాలే చేస్తానని అర్థం కాదన్నాడు. ‘టాక్సీవాలా’ (2018) లాంటి ప్రేమకథ చిత్రం వస్తే చేస్తానేమో అని చెప్పాడు.
చిన్నతనం నుంచి తనది ఓవర్ కాన్ఫిడెన్స్ అని విజయ్ నిజాయితీ చెప్పాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ను చూసి ఆశ్చర్యపోయానని, వారితో ఎలాంటి అనుబంధం లేకపోయినా ఇంత మంది ఎందుకు వచ్చారని అనుకున్నానన్నాడు. అలాగే టికెట్ బుకింగ్స్ చూసి షాక్ అయినట్టు దేవరకొండ తెలిపాడు. ఫ్యాన్స్ ప్రేమ, అభిమానం గొప్పవని, అందుకే వాళ్ల కోసం తన బెస్ట్ వెర్షన్ సినిమాలు ఇవ్వాలనుకుంటున్నట్టు విజయ్ చెప్పుకొచ్చాడు.
రాబోయే రెండేళ్లలో యాక్టర్‌గా తన కెరీర్‌లో న్యూ ఫేజ్ అనుకుంటున్నానని, కొత్త రకం కథలను ప్రయత్నించాలని అనుకుంటున్నట్టు అతను తెలిపాడు. ఒకప్పుడు తనకు ప్రేమ కాన్సెఫ్ట్ నాన్సెన్స్‌లా తోచిందన్నాడు. జీవితంలో లవ్ అనే స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. ట్రూ లవ్ ఉంటుందనే అనుకుంటున్నా అన్నాడు.
పెళ్లి అనేది బాధ్యతతో కూడుకున్నదని, అందువల్ల పెళ్లి చేసుకుంటానని విజయ్ దేవరకొండ తెలిపాడు. అయితే పెళ్లి అనే బాధ్యత తీసుకోవడానికి ప్రస్తుతం తాను మానసికంగా సిద్ధంగా లేనన్నాడు. తన 30 ఏళ్ల వయసు పెళ్లి కావాలంటోందని, మనసు మాత్రం వద్దని చెబుతోందని విజయ్ చెప్పుకొచ్చాడు.
కొన్ని విషయాల్లో పెద్దవాణ్ని అయిపోయాననిపిస్తోందని, కానీ పెళ్లి అనగానే నేను ఇంకా పిల్లోణ్నే అనిపిస్తుందని విజయ్ దేవరకొండ సరదాగా చెప్పాడు. పెద్దవాణ్ని అంటే వయసులో, పిల్లోణ్ని అంటే మనసు అనే భావనలో విజయ్ లాజిక్‌గా మాట్లాడారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.