Advertisement

Advertisement


Home > Movies - Movie News

దేవరకొండ కాల్ సెంటర్.. రష్మిక సెటైర్

దేవరకొండ కాల్ సెంటర్.. రష్మిక సెటైర్

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ చాలా క్లోజ్. వీళ్లిద్దరూ ఎంత క్లోజ్ అనే విషయాన్ని తెలుసుకోవానుకుంది నటి నేహా ధూపియా. తను నిర్వహించే ఛాట్ షోలో ఇదే విషయంపై రష్మికను కొన్ని ప్రశ్నలడిగింది.

విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితానికి సంబందించి ఒక మంచి విషయం, ఒక చెత్త విషయం బయటపెట్టింది రష్మిక. మంచి విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాడట. తను కూడా మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చానని, అందుకే తామిద్దరం ఈజీగా కలిసిపోయామని, తమ ఆలోచనలు, అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పుకొచ్చింది.

ఇక చెత్త విషయం గురించి చెబుతూ.. విజయ్ దేవరకొండ ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడట. పని గురించి తప్ప మరో ఆలోచన ఉండదట. అతడు రాకెట్ లాంటోడని, పనిపై మాత్రమే ధ్యాస్ పెడతాడని చెప్పుకొచ్చింది.

అన్నింటికంటే ముఖ్యంగా ఏమాత్రం తీరిక దొరికినా ఎప్పుడూ ఫోన్ లో ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాడని, అతడు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కు సరిగ్గా సరిపోతాదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, మంచి సూచనలు-సలహాలు ఇస్తాడని.. ఎవరైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు థెరపిస్ట్ గా బాగా పనిచేస్తాడని చెప్పుకొచ్చింది.

విజయ్ దేవరకొండను ముద్దుగా 'విజు' అని పిలుచుకుంటుందట రష్మిక. తను ఎప్పుడు అతడ్ని పలకరించినా ఇదే పదాన్ని వాడుతుందంట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?