ఉన్నట్టుండి వైరల్ అయిన దేవరకొండ

ఉన్నట్టుండి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. దీనికి కారణం తాజా చిత్రం నుంచి అతడి లుక్ రివీల్ అవ్వడమే. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం లీకులతో సతమతమౌతోంది. విజయ్ దేవరకొండ సినిమా…

ఉన్నట్టుండి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. దీనికి కారణం తాజా చిత్రం నుంచి అతడి లుక్ రివీల్ అవ్వడమే. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం లీకులతో సతమతమౌతోంది. విజయ్ దేవరకొండ సినిమా కూడా ఈ లిస్ట్ లోకి చేరింది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గ్యాంగ్ స్టర్ సెటప్ లో వస్తున్న ఈ మూవీలో అతడు గూఢచారిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతడు మేకోవర్ అయ్యాడు. ఇప్పుడా లుక్ బయటకు వచ్చేసింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. యూనిట్ శ్రీలంకలో షూట్ చేస్తోంది. అక్కడ్నుంచి ఈ లుక్ లీకైంది. విజయ్ దేవరకొండ చాలా షార్ట్ హెయిర్ తో ఉన్నాడు. గడ్డం కూడా ట్రిమ్ చేశాడు. ఇప్పటివరకు అతడు ఏ సినిమాలో కనిపించని లుక్ ఇది.

లుక్ లీకైన వెంటనే యూనిట్ చర్యలకు దిగింది. సోషల్ మీడియా నుంచి వెంటనే వాటిని తొలిగించే ప్రయత్నం చేసింది. కానీ గమ్మత్తుగా అంతలోనే మరో స్టిల్ లీకైంది.

ఈ సినిమా నుంచి ఇది కేవలం ఒక లుక్ మాత్రమే. ఇలాంటివి మరికొన్ని లుక్స్ కూడా ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు.

8 Replies to “ఉన్నట్టుండి వైరల్ అయిన దేవరకొండ”

Comments are closed.