Advertisement

Advertisement


Home > Movies - Movie News

విజయ్ @ 150 కోట్లు!

విజయ్ @ 150 కోట్లు!

ఏ హీరో రెమ్యూనిరేషన్ అయినా అతని సినిమా మార్కెట్ మీద, వసూళ్ల మీద ఆధారపడి వుంటుంది. సినిమా జస్ట్ ఓకె అనిపించుకున్నా, నిలబెట్టగలిగిన వాడే హీరో. అదే ఇమేజ్. దాన్ని బట్టే రెమ్యూనిరేషన్. 

తమిళ హీరో విజయ్ రెమ్యూనిరేషన్ వారిసు సినిమాకు వంద కోట్లు అని అప్పట్లో వార్తలు గట్టిగా వినవచ్చాయి. ఆ సినిమా ఒప్పుకునే టైమ్ కే విజయ్ రెమ్యూనిరేషన్ వంద కోట్లకు చేరిపోయింది. పైగా ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాత దిల్ రాజు చాలా భారీ ఎత్తున లాభం ఆర్జించారని వార్తలు వినిపించాయి. పైగా సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా థియేటర్ మీద వరల్డ్ వైడ్ గా దగ్గర దగ్గర వంద కోట్ల మేరకు వసూళ్లు సాగించింది.

ఇలాంటి నేపథ్యంలో విజయ్ ఇప్పుడు తన రెమ్యూనిరేషన్ అమాంతం 150 కోట్లు చేసేసారని వినిపిస్తోంది. లోకేష్ కనకరాజ్ సినిమా తరువాత మరెవరికి విజయ్ డేట్స్ కావాలంటే 150 కోట్లు రెమ్యూనిరేషన్ మరో 150 కోట్లు ప్రొడక్షన్ కు ఖర్చు చేయాల్సి వుంది. అయితే అంతకు అంతా నాన్ థియేటర్..థియేటర్ మీద వస్తుందనే ధీమా నిర్మాతలకూ వుంది. హీరోకూ వుంది.

కోవిడ్ తరువాత అన్ని రంగాల్లో ఇన్ ఫ్లేషన్ పెరిగినట్లే సినిమా రంగంలోనూ పెరిగిపోతోంది. నిర్మాణ వ్యయం మామూలుగా పెరగడం లేదు. కాస్త పెద్ద సినిమా అయితే చాలు ఖర్చు 100 కోట్లు టచ్ చేసేస్తోంది.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా