ఎక్స్ క్లూజివ్ – విజయ్ సినిమా టైటిల్

విజయ్ దేవరకొండ-క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తయారవుతోంది హీరో విజయ్ దేవరకొండ తొమ్మిదో సినిమా. ఈ సినిమా టైటిల్ ను మంగళవారం మార్నింగ్ ప్రకటించబోతున్నారు. Advertisement ఈ సినిమా టైటిల్ గా చిత్రమైన పేరు…

విజయ్ దేవరకొండ-క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తయారవుతోంది హీరో విజయ్ దేవరకొండ తొమ్మిదో సినిమా. ఈ సినిమా టైటిల్ ను మంగళవారం మార్నింగ్ ప్రకటించబోతున్నారు.

ఈ సినిమా టైటిల్ గా చిత్రమైన పేరు వినిపిస్తోంది. వింటే, ఇదేనా టైటిల్..ఇలా పెడతారా? అన్న అనుమానం కలుగుతోంది.

కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అదే టైటిల్ అని కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఆ వినిపిస్తున్న టైటిల్ ' వరల్డ్ ఫేమస్ లవర్ '. ఈ టైటిల్ కాస్త ఆడ్ గా వున్నా అదే టైటిల్ అని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ ఆలోచనలు వైవిధ్యంగా వుంటాయి. పైగా సినిమా కాన్సెప్ట్ ప్రకారం ఒకరి కన్నా ఎక్కువ మంది హీరోయిన్లు వున్నారు, రాశీఖన్నా, ఐశ్యర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. అందువల్ల ఈ టైటిల్ సినిమాకు సరిగ్గానే వుంటుందని అనిపిస్తోంది.