విజ‌య్ దేవరకొండ లేటెస్ట్…శేఖర్ కమ్ముల

లైగర్ సినిమా దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయిన తరవాత నుంచి హీరో విజ‌య్ దేవరకొండ చేస్తారనే సినిమాల జాబితా పెరుగుతూనే వస్తోంది. రోజుకో దర్శకుడి పేరు వినిపిస్తూ వస్తోంది.  Advertisement లైగర్ సినిమా డియర్…

లైగర్ సినిమా దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయిన తరవాత నుంచి హీరో విజ‌య్ దేవరకొండ చేస్తారనే సినిమాల జాబితా పెరుగుతూనే వస్తోంది. రోజుకో దర్శకుడి పేరు వినిపిస్తూ వస్తోంది. 

లైగర్ సినిమా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ల కన్నా దారుణంగా ఫ్లాప్ కావడంతో, ఖుషీ సినిమా సగం వరకు వచ్చి, మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో, ప్రతి దర్శకుడు విజ‌య్ మీదే దృష్టి పెట్టారు.

ఇప్పటికే హరీష్ శంకర్, పరుశురామ్, గౌతమ్ తిన్ననూరి లైన్ లో వున్నారని వార్తలు వచ్చాయి.లేటెస్ట్ ఈ లైన్ లోకి శేఖర్ కమ్ముల కూడా వచ్చి చేరారు. లవ్ స్టోరీ సినిమా హిట్ అయిన తరువాత ధనుష్ తో సినిమా ఫిక్స్ అయింది. అది థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జ‌రుగుతోంది. కానీ మరి మధ్యలో మరేం అయిందో లేటెస్ట్ విజ‌య్ దేవరకొండకు కూడా లైన్ చెప్పారనే వార్తలు వినిపించడం ప్రారంభమైంది.

ఇదిలావుంటే ఈసారి సినిమాను సెన్సిటివ్ డైరక్టర్ తోనే చేస్తా అని, మాస్ డైరక్టర్లు వద్దు అని విజ‌య్ దేవరకొండ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పరుశురామ్..గౌతమ్ తిన్ననూని, శేఖర్ కమ్ముల పేర్లు వార్తల్లోకి వస్తున్నాయని తెలుస్తోంది. తనకు మాస్ సినిమాల కన్నా ఫీల్ గుడ్ సినిమాలే బాగుంటాయనే ఒపీనియన్ తో విజ‌య్ దేవరకొండ వున్నారని బోగట్టా.